పుట:Chandragupta-Chakravarti.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము

163


మగునప్పటికి సెల్యూకసున కదృష్టము పట్టుటకుఁ ప్రారంభించెను, ఆన్టిగోనసు మెకడోనియాపై కెత్తిపోవ నుండెను. ఆ దాడి నాటంకపఱచి యతని విఫలమనోరధునిఁజేయ సెల్యూకసు ఉపాయము వెదకి ఆతని కుమారుని పరాజితుంజేసి యతని సైన్యములను 'గాజా' యుద్ధమున నుఱుమాడించెను. అంతటితో ఆన్టిగోనసు తనచేసిన ఏర్పాటుల నెల్ల యు మార్చుకొను వాఁడాయెను. సెల్యూకసు శకము ప్రారంభమయ్యె. టాలమీ 800 పదాతులను, 200 స్వారులనుఇచ్చి సెల్యూకసును బేబిలోనియా స్వాధీన పఱుచుకొనుమని పనిచెను. ఇంత స్వల్ప సైన్యముతో నేమి చేయవచ్చునని కొందఱు సెల్యూకసుతో వాదింపఁ జొచ్చిరి. కాని అలెగ్జాండరు దృష్టాంతమును జూపియును, వీరపురుపోచిత ధర్మముల నుపన్యసించియు, శకునముల గనుపఱచియు సెల్యూకసు దనబలములఁ బురికొల్పి మార్గమువ జయము గొనుచు బేబిలోను చేరి ఆన్టిగోనసు పక్షమువారిని పరాజితుల నొనర్చి యానగరమును వశపఱచుకొనెను. నాఁడె సెల్యూకసుల సామ్రాజ్య జన్మదినము. నాఁటినుండియు సెల్యూకసు తన స్థానమును బలపఱచుకొనఁ జొచ్చెను అచిర కాలముననే ఆన్టిగోనసు తన క్షత్రపుఁ డగు 'నికనరు' ను 10,000 పదాతులతోను, 7000 అశ్వికులతోను సెల్యూకసు పైకి ననిపెను. ఇతని సైన్యమున 3000 కాల్బంబులును, 400 స్వారులును నుండిరి. అయినను సెల్యూకసు ప్రతిభవలన నీ చిన్న సైన్యము నికనరును సంపూర్ణముగ నోడింపఁ గలిగెను.