పుట:Chandragupta-Chakravarti.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము

157


డెరయసు మనముం దేర్చెను. అలెగ్జాండరు శుద్ధచరిత్రుఁడని వాఁడు నొక్కినొక్కి వక్కాణించి యున్నాఁడు.

ఈదుఃఖము వాటిల్లిన కొంతకాలమునకే డెరయసునకు నలెగ్జాండరుతో ఘోరయుద్ధము సంప్రాప్తించి అపజయము కలిగెను. నాఁటితో పారసీక సామ్రాజ్య మంతరించె. అలెగ్జాండరునకు గ్రీసు మొదలు భరతవర్షము వఱకుఁగల ఆసియా ఖండంబును ఈజిప్టుదేశమును లోఁబడిపోయె. అచిరకాలంబుననె డెరయసు పరలోకప్రాప్తిఁ జెందెను. అతని కళేబరంబును రాజపురుషుని కళేబరమునకుం దగినరీతిని మర్యాద దప్పకుండ సమ్మానించి ద్రావకములో నునిచి ఆతని తల్లికి నివేదించునట్లు అలెగ్జాండరు ఏర్పాటులఁ గావించెను. డెరయసుతోఁ బోరు సల్పుచుండిన కాలమున నలకసుందరుఁడు చూపిన కొన్ని గుణములు ప్రశంసనీయములయి యతని స్వభావమును దెలియఁ జేయుచున్నవి.

అరెస్టను అను సేనాని యొక్కఁడు శత్రువులలో నొక్కరుని జంపి వాని శరీరముం గొనితెచ్చి అలకసుందరునకు సమర్పించి "అయ్యా! మా జాతిలో నిట్టిసమర్పణకు బంగారు గిన్న బహుమానము" అనియెనఁట. అంతట అలకసుందరుడు. "వట్టిగిన్నె ఏల? నిండుగిన్నె నిచ్చెద" నని యొక బంగారు గిన్నెకు సారానించి అందిచ్చి అతనిని గౌరవించు తెఱంగునఁ దానును ద్రావెను.

ఒకదివసము హీనజన్ముఁ డొకడు మెకడోనియను కంచరగాడిదెపయి రాజుగారి ద్రవ్యమును వేసికొని బొక్కసము