పుట:Chandragupta-Chakravarti.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము

155


దన్ననుసరించునట్లు చేసెనేగాని తాను శకునముల ననుసరింపఁ డయ్యె. ఇట్లు మహాశక్తితోఁ గార్యములుసలిపి శత్రువుల భూమింజొచ్చి వారిని రణరంగంబున నోడించి వారి దేశమునందు విశేషభాగము నాక్రమించుకొని యుద్ధములందు దొరకిన కొల్లను గ్రీకుపట్టణములకు బహుమానముగా నని పెను. గార్డియ మను పట్టణమును స్వాధీనము చేసికొనినప్పు డచ్చటి జనులొక రథమును జూపి దానికాడికి వైచియుండిన ముడిని విడఁదీసిన వాఁడు లోకంబునంతయు నేకచ్ఛత్రాధిపతిగ నేలునని నుడివిరి. అంత అలకసుందరుఁడు కత్తిదూసి యా ముడిని భేదించి వైచెనని చెప్పుదురు. ఇప్పటికిని ఆంగ్లేయభాషయందు “గార్డియను ముడిని విప్పుట" యనిన గొప్పచిక్కును వదలించుట యని యర్థము. ఇంచుమించుగ నీ గార్డియను ముడిని విడఁదీసిన కాలముననే అలకసుందరుఁడు జబ్బుపడియెను. అతని రుగ్మతకుఁదగు మందులిచ్చువారు లేరైరి అప్పుడు ఫిలిపు అనువాఁ డొకఁడు సాహసించి ఔషధం బియ్యవచ్చెను. కాని అతఁడు కపటియనియు డెరయసుపక్షపాతి యనియు నాతనిచేతి యౌషధమును గొనవలదనియు నలకసుందరున కొకమిత్రుఁడువ్రాసెను . అలకసుందరుఁ డది చూచికొని ఫిలిపు మందుగిన్నె చేతి కందిచ్చిన తరుణమున నా యుత్తరము నాతనికిచ్చుచు మందును ద్రావివైచెను. ఫిలుపును విభ్రాంతి చెందెను. అప్పుడు ఫిలువు అలకసుందరుల డెందములఁ గొందలము గొనిన భావము లూహ్యములేగాని వర్ణనీయములుగావు. కొంతసేపటికి అలకసుందరుఁడు మందువలన నారోగ్యము పొందువడఁ దన