పుట:Chandragupta-Chakravarti.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

చంద్రగుప్త చక్రవర్తి


విచిత్రమగు నుపాఖ్యానము జరిగినట్లు తెలియుచున్నది. గ్రీకు పట్టణములు అలకసుందరుని తమనాయక శిఖామణిగ నెన్నుకొను సమయమున దేశముయొక్క పదిచెరంగుల యందలి ప్రముఖులెల్లరును విచ్చేసి యుండిరి. సైనోపునగరమునకుఁ జేరిన 'డయోజనిసు' అను తత్వశాస్త్రవేత్త మాత్రము రాఁడయ్యె. ఏలరాకుండెనో చూచివత్తము గాకయని యలకసుందరుఁడు పయనమైపోయెను. ఆ సమయమున డయోజనిసు సూర్యరశ్మిలో పరుండియుండెను. జనులు గుంపుగ వచ్చుటం జూచి యతఁడు తలయెత్తి చూచెను. అంత నలకసుందరుఁ డాతని సమీపించి "అయ్యా! తమకు నే నెవ్విధముననైన నుపయోగపడఁ గలుగుదునే” యని యడుగ "నీవు సూర్య రశ్మి కడ్డము నిలువకున్నఁ జాలును" అని ప్రత్యుత్తరమిచ్చెనఁట! అది విని యలకసుందరుఁ డాతని స్వాతంత్రమునకుఁమెచ్చి "నేనలక సుందరుఁడు గాకుండిన డయోజనసు నగుట కాస చేసియుందు" నని పలికెను. దీనింబట్టి యలకసుందరుఁ డెంత నమ్రతగలవాఁడో చదువరు లెఱుంగఁ గలరు.

గ్రీకు పట్టణములచే నాయకశిఖామణిగ నెన్ను కొనఁబడి ఆలకసుందరుఁడు డెరయసుపైకి వెడలెను. ఇప్పుడు మనయందువలె నక్కాలమున గ్రీకులు మున్నగు జాతులవారియందుఁ గూడ శకునములయెడ నెక్కుడు నమ్మక ముండెడిది. ఆనమ్మకములవలన నిప్పుడు మనకుఁ గార్యభంగము గలుగునట్లే వారికిని గార్యభంగ మగుచుండెడిది. అలకసుందరుఁడు మాత్రమట్టి నమ్మకముల యాటంకమునకు నిలిచినవాఁడుగాఁడు. శకునములు