పుట:Chandragupta-Chakravarti.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

చంద్రగుప్త చక్రవర్తి


“కొందఱు ద్రవ్యకాంక్షమెయి
           గొల్తురు రాజుల ద్రవ్యమున్నచోఁ
గొందఱు రాజు లాపదలఁ
           గూరిననాఁడు భవిష్యదాశచే
నుందురు వీడకుండ; నిటు
           లుర్వికిఁ బాసిన రాజులందు నీ
చందము భక్తిఁ జూపఁగల
          సాధులు మాత్రము దుర్లభుల్ గదా!"

అని నుడివియున్నాఁడు. ఇంతకంటె నెక్కుడు వ్రాయుటకు వీలులేకుండుట కెంతయుఁ జింతిల్లవలసి యున్నది.హ్

అలకసుందరుఁడు

ఇతఁడె అలెగ్జాండరునాఁ బరఁగువాడు. ఈతనిని చంద్రగుప్తుని సమకాలికుఁడుగ నెన్నుట యంత సమంజసము గాకున్నను సెల్యూకసు రాజ్యముతో నితనికి విశేషసంబంధము గలదగుట చేతను. ఇతఁడు భారతవర్షముపై దండెత్తివచ్చి నప్పుడు చంద్రగుప్తు డీతనిని సందర్శించినట్లు చెప్పఁబడియుండుట చేతను ఈతని చరిత్ర యప్పటి పాశ్చాత్య ప్రపంచ పరిజ్ఞానమునకు ముఖ్యతమ మగుట చేతను నిట నది సంక్షిప్తముగ వర్ణిత మగుచున్నది.[1]


  1. ఇయ్యది. ఈ క్రింది శ్లోకమునకు శతావధానులుఁ దిరుపతి వేంకటేశ్వరకవుల భాషాంతరీకరణము.

    ఐశ్వర్యాదనపేత మీశ్వరమయంలో కోర్థతః సేవతే
    తంగచ్ఛంత్యనుయే వివత్తిసుపునస్తే తత్ప్రతిష్ఠాశయా
    భర్తుర్యేవ్రలయేపి పూర్వసుకృతాసంగేనవిః సంగయా
    భక్త్యాకార్య ధురంవహంన్తి బహవ స్తేదుర్లభాస్త్వాదృశాః