పుట:Chandragupta-Chakravarti.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము

149

చాణక్యునకు 'బండదంతుఁడ' నియు హేళన నామమును గలదఁట! అదియేల యనఁగ నతని యమ్మ ముంబంటిని పీకికొను మన్నందున మాతృవిధేయతకు కొఱఁత లేక యట్లుగావించి కొనెనట! కాఁబట్టి ఈ మాతృభక్తియందు అరిష్టాటులుకంటె నతని శిష్యు నలెగ్జాండరుకంటె మిక్కిలియు శ్లాఘనీయుఁ డని యెంచఁదగినవాఁడు. ..

రాక్షసుఁడు

చంద్రగుప్త చాణక్యులకుఁ దరువాత రాక్షసుఁడే ముఖ్యపురుషుఁడు అయినను ఇతనిచరిత్ర వ్రాయుటకుఁ జారిత్రక మగు నాధారము లెవ్వియుఁ గానరావు, ముద్రారాక్షస కథ వ్రాయునెడల మూఁడవ ప్రకరణమున రాక్షసుని బుద్దిచాతుర్యమును స్వామిభక్తిని వెల్లడిపఱచు నంశములు పేర్కొనఁబడినవి. ఇదివఱకు చాణక్య చరిత్రము వ్రాయుటలో నతని వయస్సును గుఱించి కొంత చర్చించినారము. ఇతఁడు నందవంశమునకు మొదటినుండియు మంత్రియైపరఁగి ఆ మైత్రిచే నా వంశమును నిలువఁ బెట్టుటకు మహాసాహసమునఁ బ్రయత్నించిన ననన్య సామాన్య స్వామిభక్తుఁడు. విధివశమున నాతని పన్నుగడ లెవ్వియును ఫలించినవిగావు. కష్టపరంపర లెన్ని డీకొనినను ఆలుబిడ్డలు ఇడుమల గుడుచుచున్నను దనకెంత యపాయము వాటిల్లినను వెనుదీయక కార్యముసాగినంతకాలము ధైర్యముతో స్వామికై పరిశ్రమ సల్పిన మహావీరుఁడుగదా ఇతండు. చాణక్యుఁడే ఇతనిని గుఱించి.