పుట:Chandragupta-Chakravarti.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము

151

ఇతఁడు గ్రీసుదేశమున కుత్తరమునందలి మెకడోనియా, రాజ్యమునకుఁ బ్రధమచక్రవర్తి నాఁజను ఫిలిపునకు పుత్రుఁడు. తల్లిపేరు ఒలింపియసు. అలకసుందరుఁడు జన్మించిన ముహూర్తము సుముహూర్తము. ఫిలిపున కప్పుడు మూడు శుభవార్త లొక్కట వచ్చిచేరెను. అతనిసేనాని మహాయుద్ద మొక్కింట విజయము గొనుటయు, అశ్వము పందెమున గెలుపు నందుటయు, అలకసుందరుఁడు పుట్టుటయు నొక్కనిమేషమున నాతని వీనులకు విందుగొలిపెను. ( క్రీ. పూ. 355 సం! జూలై మాసము 6వ తేదీ) నాఁటినుండి యలకసుందరుఁడు గారామునఁ బెరుగుచుండె. ఆతనికి మొదటి నుండియు దేహము పై విశేషాభిమానము లేకుండెను. ఎల్లప్పుడును నుత్త మాదర్శముల యెడనె అతనికి దృష్టి నిలుచుచు వచ్చెను. గ్రీసుదేశమున సుప్రసిద్ధములయి ఎల్లయౌవనులకు నాదరణా స్పదములయిన ఒలింపియా పందెములకు నితనిని బురికొల్పిన “నాతోఁ బ్రతిఘటింపఁ గిరీటధారులే తేరినచో నేను పందెమునకుఁ బోవుదు” సనియె నఁట. ఫిలిపు నూతనముగ విజయము నందెననియు గొంతరాజ్యమును గైవసము చేసికొనెననియు వినినప్పుడెల్ల నలకసుందరుఁడు సంతసించుటకు మాఱుగ తన ప్రతాపమును ప్రకటించుటకు నవసరములు దగ్గుచు వచ్చునే యని చింతించు చుండెనఁట!

ఇట్టి తేజోవంతుఁడగు నీ బాలుఁడు కార్యములయందుఁ దన ప్రతిభను జూపకుండువాడుగాఁడు. ఫిలిపులేని సమయమున