పుట:Chandragupta-Chakravarti.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము

139


నుండి తన దినచర్య గ్రంథముచే నిప్పుడు హిందూదేశ పూర్వచరిత్ర లేఖనమునకు నాధారభూతుఁడయిన మెగాస్తనీసును మనకు సంస్మరణీయులు. వీరిచరిత్ర దొఱికినంత వఱకు సంక్షిప్తముగ నీ క్రిందఁ బొందుపఱచుచున్నారము.

చాణక్య చరిత్రము

శ్రీమద్రామాయణమునందు అయోధ్యాపురిని దశరధ సుమంత్రులను, కిష్కింధాపురిని సుగ్రీవ హనుమంతులను భారతమునందు ధృతరాష్ట్ర విదురులను, కృష్ణార్జునులను చేర్చి చేర్చి తలఁచుట యెంత ప్రకటమో, అటువలెనే ముద్రా రాక్షసమును చదువువారలకు చాణక్య చంద్రగుప్తులను నంద రాక్షసులను ఏకశ్వాసముతో స్మరించుట సహజము. మఱియు నా చదువరులు చాణక్యవాక్యములను చాణక్య చేష్టితములను పరికించుతఱి, విశ్వామిత్రుని కోపసాహస సామర్థ్యములను, భీష్ముని నీతి ప్రవీణతను, కృష్ణుని శత్రుసంహారమును కపట సూత్రధారిత్వమును, హనుమంతుని స్వామికార్య ధురంధరత్వమును, హనుమద్భీష్ముల బహచర్యనిష్ఠను స్మరింపకమానరు.

విష్ణుపురాణములోను మత్స్య వాయు భాగవత పురాణములందును, బృహత్కథయందుసు చాణక్యుఁడు ప్రశంసింపఁ బడియున్నాఁడు. కామందకములో "పతిగ్రహము చేయనదియు విశాలమునైనదియు నగు ఋషివంశములలో పుట్టిన యశస్వి, అగ్నిసమతేజుఁడు, వేదవిద్వరుఁడు, నాల్గువేదములను ఒక్క వేదము పడువున అధ్యయనము చేసినవాఁడు, ప్రజ్వలన