పుట:Chandragupta-Chakravarti.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ ప్రకరణము

చంద్రగుప్తుని సమకాలీనులు

చరిత్రమున మహాపురుషు లెప్పుడును నొంటిగఁ దోఁచుటలేదు. పరిస్థితి పరిపక్వము గుదిరినం గాని మహాపురుషు లవతరించుట యరుదు. కాన లోకచరిత్రమున సుప్రసిద్ధములగు పట్టుల నెటఁ బరిశీలించినను కార్య నిర్వహణ ధురంధరులు సమాజములు కల్పించుకొని విచ్చేసిరో నాఁబరఁగుచుంద్రు. చంద్రగుప్త చక్రవర్తికాలము నిట్టిదియే. చంద్రగుప్తుని గంటికి రెప్పవోలె కాచి యాతనికి రాజ్యమును సంపాదించిపెట్టిన చాణక్యుండును, ఆ చాణక్యునకుఁ బ్రశంస నీయుండగు విరోధియయి పరఁగిన రాక్షసుండును, చంద్రగుప్తుఁ డడవుల నిడుమలు గుడుచుచుండ లోకమునంతయు నేకచ్ఛత్రముక్రిందికి దేఁ బ్రయత్నించిన సుప్రసిద్ధ వీరుండగు నలెగ్జాండరును, అలెగ్జాండరునకుఁ దరువాత నాతని కార్యమును గొంతదీర్చి యంతటి వాఁడని పొగడ్తఁగని చంద్రగుప్త చక్రవర్తి రాజ్యము నపహరింపనేతెంచి యాతనిచే పరాజితుఁడయి తనబిడ్డ నాతనికిచ్చి సంధిచేసికొనిన శెల్యూకసును, శేల్యూకసుచే నిర్ణీతుఁడయి చంద్రగుప్తుని యాస్థానమున రాయబారిగ