పుట:Chandragupta-Chakravarti.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

140

చంద్రగుప్త చక్రవర్తి

తేజుఁడు, అభిచారవజ్రముతో నందపర్వతమును వేరుతో పడకొట్టిన భూసురుఁడు, శక్తిధరసముఁడు, మంత్రశక్తితో నేకాకిగ కార్యకరణశక్తుఁడు, చంద్రగుప్తునకు ఈ మేదినిని సంపాదించి యిచ్చినవాఁడు, అర్థశాస్త్ర మహాసముద్రమునుండి నీతిశాస్త్రామృతమును చిలికి యెత్తినవాఁడు నైన విష్ణుగుప్తునకు నమస్కరించెదను " 1[1] అని యున్నది.

రాక్షసుఁడు చాణక్యసన్నిధి చేరినపుడు, " ఇతఁడుగదా దురాత్ముఁడు లేక మహాత్ముఁడు కౌటిల్యుఁడు! సముద్రము రత్నములకెల్ల బొక్కసమయినయట్లు సర్వశాస్త్రములకును శరణ్యుఁడైన వాఁడు. వీనియందు మాత్సర్యవశమున గదా

ఈతని గుణములకు సంతోషింపక యున్నారము ! "[2] అనుచు పాండిత్య స్తవమును జేసియున్నాఁడు. దశకుమార చరితము,

  1. 1. వంశేవిశాలవంశానా మృషీణామివభూయసాం |
       అప్రతిగ్రాహకాణాంయో బభూవభువివి శ్రుతః ||
       జాతవేదా ఇవార్చిష్మా న్వేదాన్వేదవిదాంవరః |
       యౌ౽ధీతవాన్సుచతుర శ్చతురో౽స్పేక వేదవత్ ||
       యస్యాభిచారవజ్రేణ వజ్రజ్వలన తేజసః |
       పపాతమూలత,శ్రీమా న్సుపర్వానందపర్వతః ||
       ఏకాకీమంత్రశక్త్యాయః శక్ఃతశక్తిధరోపమః |
       అజహారనృచంద్రాయ చంద్రగుప్తాయ మేదినీమ్ ||
       నీతిశాస్త్రా మృతంధీమా నర్థశాస్త్ర మహోడదేః |
       యఉద్దథ్రేనమస్తస్మై విష్ణుగుప్తాయ వేధనే ||

  2. కరః పర్వశాస్త్రాణాం రత్నానా మివసాగరః |
       గుణైర్నపరితుష్యా మో యస్యమత్సరిణోవయమ్ ||