పుట:Chandragupta-Chakravarti.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15]

ఎనిమిదవ ప్రకరణము

113


బేళ్లు గలవు. ఈ నీటి బాటల కర్హమగు నావ లనేక తరములవి ఉండెడివి. సంయాత్యనావలును ప్రవహణములును సము ద్రముమీఁద ప్రయాణీకుల కుపయోగపడునవి. శంఖముక్తాగ్రాహిణనావలు పేరే ప్రకటించునట్లు సాగరమునండు ముత్తెముల నేరి తెచ్చుటకుఁ బయనమగునవి. మహానావలు మహానదులయం దుపయోగపడునవి. క్షుద్రనావలును, తెప్పలును, బుట్టలును ( హరగోలు ), ప్లనములును మున్నగు నీటిని దాఁటించు సాధనములకు లెక్క లేకుండెను.

నావలలోని యుధికారులును, సేనకులును, వారివారి కర్తవ్యములును విస్తారముగ వర్ణితములయి యున్నవి. కావున నావికాయాన మప్పుడు పూర్ణస్థితియం దుండెనని చెప్ప నొప్పును.

వ్యాపారము - చేతిపనులు.

ఇట్టిబాట లుండుటవలనఁ జంద్రగుప్తుని కాలమున వ్యాపారము అతివిస్తారముగ జరుగుచుండెను. మధుర1[1], అప రాంత2[2]. కళింగ, కాశి, వంగ, వత్స3[3], మహిష4[4] దేశములు సుందరతమమగు ప్రత్తివస్త్రములం బంపుచుండెను. ముత్యములు పారశీకము నుండియు బర్బరమునుండియు ; వాసన ద్రవ్యములు

  1. 1. దక్షిణమదుర
  2. 2. కొంకణము
  3. 3. కొశాంబి.
  4. 4. మాహిష్మతి. కొందఱమతంబున మైసూరు. అర్ధశాస్త్రము సం. 2. అ 11