పుట:Chandragupta-Chakravarti.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

చంద్రగుప్త చక్రవర్తి

శివికములును పీఠికములును ననంబడు పల్లకీలును నక్కాలమున నుండెడివి.

ఇన్ని తెఱంగులగు వాహనముల ప్రయాణంబున కాకరమగు మార్గముల పథికులకు నపాయములు గలుగకుండుటకుఁ దగిన నిబంధన లేర్పఱుపఁబడి యుండెను. వాని వివరణ యనవసరము.

ప్రయాణీకుల సౌకర్యార్థము మార్గముల కిరుప్రక్కలను చెట్లవరుసలు పెంచఁబడుచుండెను. అచ్చటచ్చట నీటి వసతు లేర్పఱుపఁబడి యుండె. పూటకూలి యిండ్లను విశ్రమాలయములును బొడగట్టుచుండెను.

ఇదివఱకు వ్రాయఁబడిన దంతయును భూమార్గములను గుఱించియే. నీటి బాటలును చంద్రగుప్తుని కాలమున సుప్రసిద్ధములయి దూరభాగముల నొండొంటితోఁ జేర్చి భూమార్గముల వలెనే పాటలీపుత్ర సామ్రాజ్యమునకుఁ బటుత్వ మొసంగుటయేగాక లోకమునందలి యితర రాజ్యములతోడను అందలి ప్రజలతోడను భారతీయులకు వ్యాపార సంబంధములు కల్గించి గౌరవైశ్వర్యంబులు సమకూర్చుచుండెను. నీటిబాటలలో ననేక విభేదము లెన్నఁబడినవి. సాధారణ నదీనదములకును గాలువలకును 'కుల్యామార్గము' లనియు సామ్రాజ్యములోని రేవు లొండొంటికిని గల తీరమార్గములకు 'కూల పథము' లనియు విదేశములతో సంబంధము గడుపుచుండిన నిండు సముద్రమార్గములకు 'సంయానపథము' లనియుఁ