పుట:Chandragupta-Chakravarti.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2]

మొదటి ప్రకరణము

9


బుద్ధుడు బింబిసారుని దనశిష్యునిఁ జేసికొని రాజగృహ పట్టణమునకు వెలపలనున్న వేణువనమునందు విశేషముగా వాసము చేయుచుండెను. అనేక రాజులును, విద్వాంసులును, బ్రహ్మవేత్తలును వేణువనమునకు వచ్చి యాతని మతమును స్వీకరించిరి. బుద్ధుఁడు నిర్యాణము చెందిన సంవత్సరముననే రాజగృహము నొద్ద సప్తపరిణెగుహలో ఏ నూరుగురు బౌద్ధాచార్యులు చేరి బుద్ధుని యుపదేశ వాక్యములను మూఁడు పిటకములుగా సంగ్రహించిరి.

బింబిసారుఁ డిరువదియెనిమిది సంనత్సరములు రాజ్యము నేలి తన రెండవ భార్య కుమారుఁ డగు అజాతశత్రునకు పట్టముఁగట్టి తాను ముక్తిమార్గమును వెతకుచుండెను. కాని అజాతశత్రువు దుర్మార్గుఁడై దేవదత్తుఁ డనువాని బోధవలనఁ దండ్రిని జంపించెను.

అజాతశత్రువు క్రీ. పూ 500 ల ప్రాంతమున రాజ్యమునకు వచ్చెనని చెప్పవచ్చును. గౌతమబుద్ధుని బోధవలన నీతనికిఁ దానుజేసిన పితృహత్యకై పశ్చాత్తాపముగలిగెననియు దరువాత నాతఁడు పరిశుద్దాచరణ గలవాఁడుగ నుండెననియు బౌద్ధ గ్రంథములు చెప్పుచున్నవి. ఈ యజాతశత్రువునకును, గోసలదేశపు రాజునకును, జరిగిన యుద్ధవిషయమైన యొకవింత కథ గలదు. అప్పటి కోసలాధీశ్వరుడు పసేనది. (ప్రసేనధీ ) ఈతని యక్కయగు కోసలాదేవి బింబిసారుని భార్య ; అనగా అజాతశత్రువునకు సవతి తల్లి. తన సవతికొమారుడగు నజాత