పుట:Chandragupta-Chakravarti.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

చంద్రగుప్త చక్రవర్తి


శత్రువు తన భర్తను జంపగాఁ గోసలాదేవి యా దుఃఖముతో మరణ మొందెను. కోసలరాజులు కాశీరాజ్యములోని కొన్ని గ్రామములు కోసలాదేవికి నరణమిచ్చియుండిరి. ఆమె పోగానే యా గ్రామములు గోసలరాజయిన పసేనదిచే నాక్రమింపఁ బడియె. అందుపై ముసలివాడగు పసేనదికిని, అతని సవతి మేనల్లుడగు నజాతశత్రువునకును యుద్ధము ప్రారంభమాయెను. మొదట నజాతశత్రువునకు గొంచెము జయము కిలిగెఁ గాని నాల్గవసారి యాతడు దాడి వెడలినప్పుడు పసేనదిచేఁ జెఱఁబెట్టఁ బడియె. కాశీదేశము గ్రామములపై దనకు నేమియు హక్కులేదని యనిపించుకొని యాతని గోసలేశ్వరుడు విడిచి పెట్టెను. కాని చెఱలో నున్న కాలమందు నాతనికిని గోసలేశ్వరుని కూఁతునకును బ్రేమ యంకురించినందునఁ గోసలేశ్వరుడు తన కూతురగు వజిరా (వజ్రా) దేవిని అజూతశత్రువునకిచ్చి వివాహము చేసి వివాద గ్రామములనే యూమెకు అరణ మిచ్చెను.

ఇట్లు కోసలదేశములోని కొంత భాగమును స్వాధీన పఱచుకొని యజాతశత్రువు గంగ కుత్తరమందున్న లిచ్ఛవీ దేశముపై దండు వెడలి రాజధానియైన వైశాలి పట్టణమును స్వాధీన పజచుకొనెను. అజాతశత్రుని తల్లి లిచ్ఛవీ రాజు కూతురైనందున యిప్పుడీతడు జయించిన రాజ్యము తాతదయినను, మేనమామ దైనను కావలయును. ఈ దిగ్విజయముచే నాతడు గంగా నదికిని, హిమాలయ పర్వతమునకును నడుమ నున్న రాజ్యముయొక్క ఎక్కువ భాగమును సంపాదించి