పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిల్లవాణ్ణి శిక్షించడానికి బెత్తం వాడాలి. చిన్నపుడే బాలునికి మంచిమార్గంలో నడవడం నేర్పిస్తే పెద్దయ్యాక ఇక ఆ త్రోవ తప్పడు. బెత్తంవాడని తండ్రి పుత్రుని ప్రేమించినట్లు కాదు తనయుని ప్రేమించే తండ్రి వాణ్ణి శిక్షించితీరుతాడు బాలుని హృదయంలో చాపల్యం సహజంగానే వుంటుంది బెత్తం ఉపయోగిస్తే అది తొలగిపోతుంది. బాలుని శిక్షించడానికి వెనుకాడవద్దు బెత్తంతో కొడితే వాడు చనిపోడు బాలునికి తాను నడువవలసిన మార్గాన్ని గూర్చి బోధిస్తే పెరిగి పెద్దవాడైన పిదపగూడ ఆ త్రోవను విడనాడడు - సామె 13,24. 22, 15. 23,13. 22,6. ఇప్పటిలాగే పూర్వంగూడ ఆడపిల్లలనుగన్న తండ్రి నానావిధాల ఆందోళనం చెందేవాడు. తండ్రి కొమార్తనుగూర్చి ఆందోళనం చెందుతాడు రేయి అతని కంటికి కూర్మరాదు ఈ సంగతి కొమార్తెకు తెలియదు దుహిత బాలికగావుంటే ఆమెకు పెండ్లికాదేమో అనీ పెండ్లయితే ఆమె సుఖింపదేమో అనీ తండ్రి విచారిస్తాడు పత్రిక కన్యగావుంటే ఎవరైనా ఆమెను చెరుస్తారేమో అనీ ఆమె పట్టింటనే గర్భవతి ఔతుందేమో అనీ అతని భయం ఆమెకు పెండ్లయితే శీలవతిగా వుండదేమో అనీ లేదా సంతానం కలగదేమో అనీ అతని వగపు - సీరా 42, 9–10.

13. పెద్దలపట్ల గౌరవం

పెద్దలపట్ల మనకు గౌరవం వుండాలి. తల్లిదండ్రులు, జ్ఞానులు, వృదులు, యజాకులు, వైద్యులు, అధికారులు మొదలైనవాళ్లు పెద్దలు. మొదట మనం తల్లిదండ్రులను గౌరవించాలి