పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భార్యాభర్తల కలయికవల్ల పిల్లలు జన్మిస్తారు. తల్లిదండ్రులు తమ బిడ్డలను
జాగ్రత్తగా పెంచి ప్రయోజకులను చేయాలి. విశేషంగా కుమారుడు బాలుడుగా వున్నపుడే
తండ్రి వాడికి క్రమశిక్షణం నేర్పాలి. తండ్రి చనిపోయాక గూడ తన కుమారుల్లో జీవిస్తాడు.
ప్రేమగల తండ్రి తన కుమారుడ్డి తరచుగా శిక్షించాలి
సుశిక్షితుడై పుత్రుడు పెరిగి పెద్దవాడైనప్పడు
తండ్రి సంతోషపడతాడు
కుమారుడ్డి క్రమశిక్షణకు గురిచేసే తండ్రి
సత్ఫలితాన్ని పొందుతాడు.
అతడా పత్రునిగూర్చి మిత్రులతో గొప్పలు చెప్పకోగలడు
కుమారునికి విద్యగరపిన తండ్రి
తన శత్రువులకు అసూయ పుట్టిస్తాడు
అతడా పత్రుని తలంచుకొని మిత్రులమధ్య
సగర్వంగా తిరుగుతాడు
తండ్రి చనిపోయినా చనిపోయినట్లు కాదు
అతని ప్రతిబింబమైన కుమారుడు మిగిలివున్నాడు కదా!
తండ్రి బ్రతికివున్నపుడు పుత్రునిజూచి ఆనందిస్తాడు
చనిపోయేపుడు నిశ్చింతగా చనిపోతాడు
కాని పుత్రుని చెడగొట్టే తండ్రి
వాని గాయాలకు కట్ట కడతాడు
వాడు ఏడ్చినపుడెల్ల అతని హృదయం కరుగుతుంది
చక్కగా తర్ఫీదు నీయని గుర్రం మొండిదౌతుంది
అదుపుమీరిన కుమారునికి పొగరెక్కుతుంది
గోముగా బెరిగిన బిడ్డడు కడన తండ్రికి నిరాశ కలిగిస్తాడు
తండ్రి పుత్రునితో ఆడిపాడెనేని
తర్వాత అతనికి దుఃఖం తప్పదు
బాల్యంలో బిడ్డడికి స్వేచ్ఛ ఈయరాదు
వాడి తప్పిదాలకు దండనం విధించి తీరాలి
కనుక శ్రమపడి నీ తనయునికి శిక్షణనీయి
లేకపోతే వాడు నీకు అపకీర్తి తెస్తాడు - సీరా 30, 1-13.