పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జ్ఞానులు తమ విజ్ఞానాన్ని రాజస్థానాల్లో బళ్ళల్లో కుటుంబాల్లో కూడ బోధించారు. విజ్ఞానాన్ని సాధించే మార్గాలు పఠనం, క్రమశిక్షణ, జ్ఞానుల సూక్తులను ఆలించడం మననం చేసికోవడం, దేవునికి ప్రార్థన చేయడం మొదలైనవి. విజ్ఞానానికి ఆధారం ప్రభువే. అతనినుండేగాని మనం జ్ఞానాన్ని సంపాదించలేం - సీరా 1.1. కావుననే సొలోమోను జ్ఞానం కొరకు ఈలా ప్రార్థించాడు

నీవు నీ జ్ఞానాన్ని దయచేస్తేనే తప్ప,
స్వర్గంనుండి నీ పవిత్రాత్మను పంపితేనే తప్ప
నీ చిత్తాన్ని ఎవడు తెలిసికోగలడు?
ఈ రీతిగా నీవు దయచేసే జ్ఞానంద్వారా
భూమిమీది నరులు ఋజుమార్గంలో నడుస్తున్నారు
నీకు ప్రీతికరమైన కార్యమేమిటో తెలిసికొంటున్నారు
భద్రతను పొందుతున్నారు - సాలో జ్ఞాన 9, 17-18.

6. విజ్ఞానం ఓ దైవవ్యక్తి

ఈ గ్రంథాలు చాల తావుల్లో విజ్ఞానాన్ని ఓ దైవ వ్యక్తినిగా వర్ణిస్తాయి.

1) విజ్ఞానం మనకు ఓ ఆతిధేయ, ఆమె మనకు అందించే అన్నపానీయాలు విజ్ఞానమే.

రా, నేను తయారుచేసిన భోజనాన్ని ఆరగించు
నేను సిద్ధంచేసిన ద్రాక్షాసవాన్ని సేవించు
మూర్ఖత్వాన్ని విడనాడితే నీవు బ్రతికిపోతావు
విజ్ఞాన పథాన నడుస్తావు - సామె 9, 4-5.

2) ప్రభువు ఈ విజ్ఞానాన్ని ప్రప్రథమంలోనే సృజించాడు. అది శాశ్వతమైంది. ప్రభువు లోకాన్ని సృజించేపుడు ఆది వో శిల్పిలా అతని ప్రక్కన నిల్చుండి వుంది. దానిలో దైవత్వమంది.

ప్రభువు నన్ను ప్రప్రథమంలోనే సృజించాడు
తాను పూర్వమే కలిగించిన వాటన్నిటిలోను
నన్ను మొదటిదాన్నిగా చేసాడు
నేను ప్రధాన శిల్పివలె అతనిచెంత నిల్చివున్నాను
పసికందులాగ రోజురోజు అతనికి ఆనందం చేకూరుస్తూ
నిత్యం అతని సన్నిధిలో ఆటలాడుకొనేదాన్ని