పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతడు చేసిన పుడమిమీద క్రీడిస్తూ ప్రమోదంతో మానవాళిమధ్య వసించేదాన్ని - సామె 8, 30-31

3) అది యిస్రాయేలీయుల మధ్య వసిస్తుంది. విజ్ఞానమూ ధర్మశాస్త్రమూ వొకటే.
సర్వాన్ని కలిగించిన దేవుడు నాకాజ్ఞ యిచ్చాడు
సృష్టికర్త నేనెచట వసించాలో నిర్ణయించాడు
అతడు నీవు యాకోబు వంశజులమధ్య వసించు
యిస్రాయేలీయులు నీ ప్రజలౌతారని చెప్పాడు
ఈ విజ్ఞానం మోషే అజ్ఞాపించిన ధర్మశాస్త్రం
మహోన్నతుడైన ప్రభువు నిబంధన గ్రంథం
యిస్రాయేలీయులకు వారసంగా లభించిన ఆస్తి - సీరా 24, 8, 23.
ఈ విజ్ఞానం దేవుని ఆజ్ఞల గ్రంథం
శాశ్వతంగా నిల్చే ధర్మశాస్త్రం
దాన్ని పాటించేవాళ్ళ బ్రతుకుతారు
విడనాడేవాళ్ళు చస్తారు - బారూకు 4,1

4)సాలోమోను జ్ఞానగ్రంథం 7, 22-27 వచనాలు విజ్ఞానానికి దేవుని గుణాలను ఆరోపిస్తాయి. విజ్ఞాన వర్ణనలన్నింటిలోను ఈ భాగం పర్వత శిఖరం లాంటిది. ఈ జ్ఞానం దేవునికి ప్రతిరూపమే.

అది దైవశక్తియొక్క శ్వాసం
ప్రభువు మహిమయొక్క స్వచ్ఛమైన ప్రవాహం
మలినమైనదేదీ దానిలోనికి ప్రవేశింపలేదు
అది శాశ్వతజ్యోతికి ప్రతిరూపం
దేవుని క్రియాశక్తిని ప్రతిబింబించే నిర్మల ముకురం
అతని మంచితనానికి ప్రతిబింబం – 7,25-26

7. విజ్ఞానం క్రీస్తే

దైవగుణాలు కలిగిన ఈ విజ్ఞానం నూత్న వేదంలో క్రీస్తుగా అవతరించింది. పూర్వవేదం బోధించిన విజ్ఞానం క్రీస్తేనని చెప్తుంది నూత్నవేదం.

జ్ఞానగ్రంథకర్తల్లాగ క్రీస్తుకూడ సామెతలతోను సూక్తులతోను బోధించాడు. పర్వతప్రసంగమే ఇందుకు సాక్షి అతడు జ్ఞానియైన సాలోమోనుకంటె గొప్ప జ్ఞాని - మత్త 12, 42, తన కోశాగారంనుండి నూతన, పురాతన వస్తువులను వెలికితెచ్చే ధర్మశాస్త్ర