పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రైస్తవులను ఐక్యపరచవలసిన తల్లి ఈలా వాళ్ళ విభజనకు కారణం కావడం చాల దురదృష్టం.

వాటికన్ మహాసభ మొదట మరియమాతమీద గూడ ఓ చట్టం తయారుచేసింది. కాని ఆ చట్టంవలన ప్రోటస్టెంటులను రెచ్చగొట్టినట్లవుతుందని మళ్ళా దాన్ని ఉపసంహరించుకొంది. అందలి ముఖ్యాంశాలను శ్రీసభనుగూర్చిన చట్టంలోనే ఓ అధ్యాయంగా చేర్చింది. ఈ సభ మరియు మాతకు "మధ్యవర్తిని" అనే బిరుదంకూడ కొంచెం జంకుతూనేగాని వాడలేదు. అలా వాడిన తావుల్లోగూడ “మరియు మాత మధ్యవర్తిత్వం క్రీస్తు మధ్యవర్తిత్వానికి ఏమీ చేర్చదు. ఆ మధ్యవర్తిత్వం నుండి ఏమీ తొలగించదు" అని స్పష్టంగా చెప్పింది.

వాటికన్ ధోరణి ఈలా వుండగా మరియమాతను గూర్చిన ప్రోటస్టెంటు దైవశాస్త్రజ్ఞల దృష్టికూడ ఇటీవల చాలవరకు మారిపోయింది. వాళ్ళ బైబులును జాగ్రత్తగా చదివి మరియు స్థానాన్ని గుర్తిస్తున్నారు. ఇప్పడుభయ వర్గాలనుండి సమైక్యతా భావాలు పట్టుకవస్తున్నాయి.

మరియమాత క్రైస్తవశాఖలకు ఐక్యత ప్రసాదించాలి అంటే మొదట ఈ శాఖలవాళ్ళు కొన్ని నూత్న దృక్పథాలు అలవరచుకోవాలి. ప్రోటస్టెంటులు క్యాథలిక్కులు కూడ తమ వైఖరిని మార్చుకోవాలి.

ప్రోటస్టెంటు శాఖలవాళ్ళ బైబులే కాకుండా పారంపర్య బోధనుగూడ గుర్తించాలి. క్రైస్తవమతం 16వ శతాబ్దంలో లూథరు తిరుగుబాటుతోనే పుట్టలేదు. ఆ మాతానికి అంతకుముందే పదహారు వందల యేండ్ల జీవితచరిత్ర వుంది. ఆ పదహారు వందల యేండ్లలో క్రైస్తవ ప్రజలు మరియమాతను ఎలా పూజించారో ఎందుకు పూజించారో అర్థం చేసికోవాలి. బైబులు మరియమాతను గూర్చి అన్ని విషయాలూ చెప్పదు. అసలు దాన్ని వ్రాసినప్పటి పరిస్థితులువేరు. కాని బైబులుచెప్పిన విషయాలను జాగ్రత్తగా పరిశీలించి చూచినట్లయితే నేడు క్యాథలిక్ సమాజం మరియు మాతనుగూర్చి విశ్వసించే విషయాలు అంత అసందర్భంగా దోపవు. ఉదాహరణకు, నూత్నవేదమెక్కడాకూడా మరియు నిష్కళంకోద్బవి అని చెప్పదు. ఐనా క్యాథలిక్ శ్రీసభ అలా నమ్ముతుంది. ఈ నమ్మికకు ఆధారం లూకా 1, 28 వాక్యంలోని దైవానుగ్రహ పరిపూరురాలు" అనే మాటలో లేక పోలేదు. ఈలాగే మిగతా విషయాలు కూడాను.

క్యాథలిక్ క్రైస్తవులు మరియమాతను కొనియాడేపుడు ఎందుకు అలా కొనియాడుతున్నారో ప్రోటస్టెంటులకు వివరించి చెప్పగలిగి వుండాలి. ఈ విషయంలో ప్రోటస్టెంటులు ప్రశ్నించినా క్యాథలిక్కులు తరచుగా తృప్తికరమైన జవాబు