పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈయలేకపోతున్నారు. అంచేత వాళ్ళసందేహం ఇంకా బలపడుతూంటుంది. పైగా క్యాథలిక్కులు కొంతమంది క్రీస్తును మరియమాతను కలిపివేస్తుంటారు. క్రీస్తును ఆరాధించినా మరియను పూజించినా ఒకటే అనుకుంటూంటారు. ఇంకా కొంతమంది అజ్ఞానంవల్ల క్రీస్తును విస్మరించి మరియను మాత్రమే పూజిస్తుంటారు. ఈలా చేయడం తప్పు. క్రీస్తువేరు, మరియవేరు. వాళ్ళిద్దరూ చేసిన కృషికూడ వేరువేరు. మనలను రక్షించింది. క్రీస్తు. ఆ క్రీస్తుని బట్టి మరియమాత వచ్చింది. అంతేగాని, మరియమాతను బట్టి క్రీస్తు రాలేదు. కనుక మనం మొదట రక్షకుడైన క్రీస్తును ఆరాధించి ఆ పిమ్మట మరియమాతనుగూడ గౌరవించాలి. ఇది ప్రాచీన క్రైస్తవ సంప్రదాయం. మరియు మాతనేమో గౌరవించవలసిందే. కాని క్రీస్తునిబట్టి మాత్రమే. "ఇకమీదట సకలతరాలవాళ్ళు నన్ను ధన్యురాలినిగా భావిస్తారు. ఎందుకంటె సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేసాడు ' అన్న మరియు వాక్యంగూడ యిదే. వాటికన్ సభ దృక్పథం వలననైతేనేమి, ప్రపంచమందలి వివిధ క్రైస్తవ శాఖల నాయకుల కృషివలన నైతేనేమి మరియమాత వివిధ క్రైస్తవ సంప్రదాయాల వాళ్ళను ఐక్యపరుస్తుందని విశ్వసిద్దాం.

2. హైందవ సంప్రదాయం

}}

ఈ దేశంలో చాలమంది హిందువులు కన్యమరియను గౌరవిస్తుంటారు. మన ప్రాంతంలోనే చూచినట్లయితే గుణదలలో జరిగే లూర్దుమత తిరునాళ్ళలో చాలమంది హిందువులు పాల్గొని కానుకలు అర్పిస్తుంటారు. మరియమాత ప్రతిమనో, చిత్రాన్నో ఇండ్లల్లో వుంచుకొని ఆమెను గౌరవించే హిందూ కుటుంబాలుకూడ కొన్ని ఈ రచయితకు తెలుసు. ఇక హిందూమతంలో మరియలోలాగ కన్యాత్వమూ మాతృత్వమూ ఒకేవ్యక్తియందు కన్పించే దేవత ఎవరూలేరు. కాని తల్లిగానో కన్యగానో పరిగణింపబడే దేవతామూర్తులు మాత్రం చాలమంది వున్నారు. ఈ "కన్యలు" ఈ 'అంబలు" మరియమాతను సూచిస్తుంటారు. వీళ్ళందరికీ ఆమె ప్రాతిపదికగా వుంటుంది. మరియ క్రైస్తవ ప్రజనేగాదు, సర్వమానవాళిని క్రీస్తుతో జోడిస్తుంది అన్నాం. అంబలనూ, కన్యలనూ గౌరవించే హిందూ ప్రజలను, హృదయశుద్ధితో భగవంతుని వెదకే జనులందరినీ, ఆ తల్లి తన చెంతకూ తన కుమారుని చెంతకూ చేర్చుకోవాలని మనవిచేద్దాం. చేర్చుకుంటుందని ఆశిద్దాం.

3. ముస్లిముల సంప్రదాయం

}}

హిందూవుల్లాగే ముస్లిములు చాలమందిగూడ మరియను గౌరవిస్తుంటారు. మరియమాత గుళ్ళకువెళ్ళి ఆమెను పూజిస్తూంటారు. కొరాను ప్రకారం మరియ