పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వర్ణనలు జీర్ణం చేసికొ="^ కనుక అతడు నరకాన్ని గూర్చి చెప్పేపుడు గూడ ఈ వర్ణనలను విరివిగా వాడాడు.

నూత్నవేదరచయితల్లో యోహాను పౌలు నరకాన్ని ప్రస్తావించేప్పడు అగ్నిని అట్టే పేర్కొనలేదు. తొలి మూడు సువార్తలూ, విశేషంగా మత్తయి ఈ నరకాగ్నిని విరివిగా వర్ణించాడు. ఇతడు పూర్వవేద సంప్రదాయాన్ని ఎక్కువగా అనుసరించిన రచయిత. ఇతని సువిశేషం కూడ ఆ పూర్వవేదం బాగా తెలిసిన యూదుల కొరకే ఉద్దేశింపబడింది. ఇక ఈ రచయిత దృష్టిలో నరకాగ్ని అంటే యేమిటి? అది వో సాంకేతికమైన పదం. మత్తయి దృష్టిలో ఈ పదానికి దేవునికి కోపమనీ, శిక్ష అనీ, నరుడుతన పాపాలకు పొందే దండనమనీ అర్థం. కావున మనం నరకాగ్ని మన భౌతికమైన నిప్పునిగా అర్థం చేసికోగూడదు. మన భౌతిక పదార్ధాలేమీ నరకంలో ఉండవు.

ఇంకా నూత్నవేదం నరకంలో "పురుగు" "గంధకం" ఉంటాయని చెప్తుంది - మార్కు9,43. దర్శ 14,10. ఇవి కూడ దైవశిక్షను సూచించే సాంకేతిక పదాలే. ఈలాగే నూత్నవేదం మోక్షాన్ని గూర్చి చెప్పేపుడు దాన్ని వివాహోత్సవంగాను, విందుగాను, జీవజలంగాను, వెండి బంగారాలుగాను వర్ణిస్తుంది. అక్కడ సుఖసంతోషాలుంటాయని ఈ వర్ణనల భావం. కావున ఇవన్నీ వట్టి సంకేతాలు, ఉత్ప్రేక్షలు. మోక్షాన్నీ నరకాన్నీ గూర్చిన ఈ వర్ణనలను ఉన్నవాటిని ఉన్నట్లుగా అర్థం చేసికోగూడదు. ఇవి సూచించే భావాన్ని మాత్రం గ్రహించాలి.

సంగ్రహంగా నరకాగ్ని అంటే యేమిటి? నరుని అతని పాపమే దహిస్తుంది. ఈ స్వీయపాపాన్నే యెషయా అగ్ని అని పేర్కొన్నాడని చెప్పాం. కనుక నరకంలో ఉన్నవాళ్ళని వాళ్ళకి వెలుపలవున్న వస్తువేదో వచ్చి దహింపదు. అసలు అలాంటి వస్తువేదీ నరకంలో ఉండదుకూడ. పాపభరితమైన దుషుల అంతరాత్మే ఆ దుషులను బాధిస్తుంది. వాళ్ళు బుద్ధిపూర్వకంగా దైవదర్శనాన్ని కోల్పోయారు కనుకను, ప్రేమగల తండ్రివంటివాడైన దేవుణ్ణి బుద్ధిపూర్వకంగా నిరాకరించారు కనుకను, వాళ్ళ అంతరాత్మ వాళ్ళని లోలోపలే బాధిస్తుంది. ఈలోపలి బాధనే బైబులు అగ్ని అని పిలుస్తుంది. దీనికిమించి వేరే అగ్ని యేది నరలోకంలోలేదు.

2. దైవసాన్నిధ్యాన్ని కోల్పోవడమే నరకం

1. నరకాన్ని గూర్చిన ముఖ్యాంశం ఏమిటి?

పూర్వాంశంలో నరుని అంతరాత్మ అతన్ని పీడించడమే నరకాగ్ని అనిచెప్పాం. కాని ఈ యంతరాత్మ నరుణ్ణి ఎందుకు బాధపెడుతుంది? అతడు బుద్ధిపూర్వకంగా