పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/279

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


8. నరకాగ్ని అంటే యేమిటి? మనం మామూలుగా నరకం అనగానే అగ్ని అనుకొంటాం, మత్తయి సువిశేషం ఈ యగ్నిని గూర్చిన భావాన్ని ఎక్కువగా ప్రచారం చేసింది. కాని నరకాగ్ని అనేది కేవలం సాంకేతిక పదం. ఈ పదం భావం ఏమిటి? పూర్వవేదంలో నిప్ప దేవుని సాన్నిధ్యానికి చిహ్నంగా ఉంటుంది. మోషే మండుతూన్న పొదలో దేవుణ్ణి చూచాడు - నిర్గ 3,2 మళ్ళా సీనాయి కొండమిూద నిప్ప మంటల్లో దేవుణ్ణి దర్శించాడు - నిర్ణ 19,18. కాని ఈ భావం మనకిక్కడ పనికిరాదు. పూర్వవేదంలో నిప్ప దేవుని కోపానికీ శిక్షక్రీ తీర్పుకీ కూడ చిహ్నంగా ఉంటుంది. యెషయా ప్రవక్త దుషులను శిక్షించడానికి వచ్చే దేవుణ్ణి వర్ణిస్తూ "ప్రభువు శక్తి దూరం నుండి విచ్చేస్తూంది అతని కోపం నిప్పవలె మండుతూంది దట్టమైన పోగవలె రాజుకొంటూంది అతని పెదవులు ఆగ్రహపూరితాలై యున్నాయి అతని జిహ్వ జ్వలించే అగ్గిలా ఉంది" అని వర్ణించాడు-30,27, నరకాగ్నిని అర్థం చేసికోవడానికి ఈ వర్ణనం కొంతవరకు ఉపయోగపడతుంది. నిప్ప దైవకోపానికీ శిక్షక్రీమాత్రమేకాదు, నరుల పాపాలకుగూడ చిహ్నంగా ఉంటుంది, దుషుని అతని పాపమే అగ్నిలా దహిస్తుంది. పై ప్రవక్త పాపాత్ములను వర్ణిస్తూ "ప్రజల పాపాలు అగ్గిలా మండి ముండ్లపొదల నన్నిటినీ తగులబెడతాయి ఆ పాపాలు అడవిలోని కారుచిచ్చులా రగుల్కొని పొగలు వెడలగ్రక్కుతాయి సర్వశక్తిమంతుడైన ప్రభువు కోపాగ్ని దేశాన్నంతటినీ కాల్చివేస్తుంది ప్రజలెల్లరూ ఆ యగ్నికి ఆహుతి యూతారు" అని వర్ణించాడు - 9,18-19. ఇంకా అతడు దుషులను గూర్చి చెపూ "వారి పరుగు చావదు, వారి యగ్లి చల్లారదు" అని చెప్పాడు – 6624. అనగా దుర్మార్డులు నిరంతరం అగ్నిలో కాలతారు, పురుగులకు మేత ఔతారు అని భావం. ఈ వర్ణనలనుబట్టి పూర్వవేదంలో నిప్ప దైవకోపాన్నీ నరుల పాపాన్నీ గూడ సూచిస్తుందనుకోవాలి. క్రీస్తు ఈ పూర్వవేద సంప్రదాయంలో పుట్టి చిన్ననాటినుండే ఈ