పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రోజురోజుకీ ఇంకా సంపన్నులౌతున్నారు మరి నేను విశుద్దుణ్ణిగా జీవించడంవల్ల ఫలితమేమిటి?

దుష్కార్యాలు విడనాడ్డం వలన లాభమేమిటి?

నేనీ సమస్యలను అర్థం జేసికోజూచాను

కాని అది నాకు దుర్గహమైంది
అంతలో ఒకనాడు నేను దైవరహస్యాన్ని గ్రహించాను 

దుష్టుల కేలాంటిగతి పడుతుందో తెలిసికొన్నాను

వాళ్ళ క్షణకాలంలో నాశమౌతారు
ఫరోరవినాశానికి జిక్కి కంటికి కన్పించకుండా బోతారు".

3.మనం ఆనాడు ప్రభువు న్యాయనిర్ణయానికి తట్టుకోవాలంటే ఇప్పుడు న్యాయయుక్తంగా జీవించాలి. ప్రతిరోజూ ఈనాడే నాకు న్యాయనిర్ణయం జరగవచ్చుననుకొని విశుద్ధంగా బ్రతకాలి. పునీతులు ఈలా చేసారు. మనలో ప్రతివాణ్ణి దేవుడు ప్రతిరోజూ, ప్రతిక్షణమూ గమనిస్తూనే వుంటాడు కదా! ప్రతిరోజూ, ప్రతిక్షణమూ అతడు మన తలంపులకూ మాటలకూ చేతలకూ తీర్పుతీరుస్తూనే ఉంటాడు కదా! ఈ తీర్ప న్యాయనిర్ణయ దినాన గూడ లెక్కలోకి వస్తుంది. కనుకనే మనం ప్రతిరోజూ ఈదినమే నాకు తీర్పు జరుగుతుందేమో ననుకోవాలి అని చెప్పాం. మనం నరులను మోసగించినా దేవుణ్ణి మోసగించలేం. నరుల దృష్టిలో మనకు విలువ వుండవచ్చు. కాని అది లెక్కలోనికి రాదు.దేవుని దృష్టిలో ఉండే విలువే నిజమైన విలువ. కనుక మనం అనుక్షణమూ అనుదినమూ నిజాయితీతో జీవించాలి. ఈ సందర్భంలో బైబులు అబ్రాహాము హనోకులాంటి పుణ్యపురుషులు దేవుని సన్నిధిలో నడచారని చెప్తుంది. అనగా వాళ్లు చిత్తశుద్ధితోను దైవభక్తితోను జీవించారని భావం. ఈ భాగ్యం మనకుకూడ అబ్బితే యెంత బాగుంటుంది!

4.మన భవిష్యత్తుని మనమే నిర్ణయించుకొంటాం. ఇక్కడ మనం చేసే ప్రతి పుణ్యకార్యమూ మనం నిర్మించుకొనే మోక్షసౌధంలో ఓ రాయి ఔతుంది. అలాగే ఇక్కడ మనం చేసే ప్రతిపాపకార్యమూ పరలోకంలోని మన శిక్షామందిరంలో ఓ రాయి ఔతుంది. ప్రభువు మనం ఇప్పడు చేసే మంచి చెడ్డలకే అప్పడు తీర్పు తీరుస్తాడు. అసలు మన తీర్పుని మనమే తయారు చేసుకొంటాం.న్యాయనిర్ణయ దినాన దేవుడు ఆ తీర్పుని మాటలతో ప్రకటిస్తాడు, అంతే. కనుక ప్రస్తుతం మనం ఏలాంటి జీవితం జీవిస్తున్నాము అనేదానిమిూదనే అంతా ఆధారపడి ఉంటుంది. 268