పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉంటుంది. ఆ తేజోమూర్తి చనిపోయేవాళ్ళను అడిగే రెండు ముఖ్యవిషయాలు వాళ్ళ లోకంలో తోడినరులను ప్రేమించారా అనీ, తన్ను గూర్చి తెలుసుకోవలసినంతగా తెలుసుకొన్నారా అనీని. ఈ చనిపోయేవాళ్ళ భావాలుకూడ దేవుడు మరణ సమయంలో మనకు తీర్పు తీరుస్తాడనే సత్యాన్ని ధ్రువపరుస్తున్నాయి కదా!

ప్రార్థనా భావాలు

1. న్యాయాధిపతి ఒకడున్నాడనీ అతడు మనకు మరణ సమయంలో ఖండితంగా తీర్పు తీరుస్తాడనీ చెప్పాం. కనుక మన తరపున మనం చిత్తశుద్ధితో జీవించాలి. నరుల కన్నుగప్పినా దేవుని కన్నుగప్పలేం. ఆ ప్రభువుకి మన హృదయాలోచనలు కూడ తెలుసు. కనుక మనం అతి నిర్మలంగా జీవించాలి. ఈ సందర్భంలో ఆత్మజ్ఞానంకూడ ఎంతో ఉపయోగపడుతుంది. అనగా మన లోపాలూ మేలిగుణాలు కూడ వునకు బాగా తెలిసి వుండాలి. ఆలోపాలను రోజురోజూ సవరించుకొంటూండాలి. ఆ మేలిగుణాలనుగూడ రోజురోజుకీ వృద్ధి చేసికొంటూండాలి. ఈలా చేయకుండా లోకాన్ని వంచిస్తూ, మనలను మనం వంచించుకొంటూ కాలం గడిపితే చివరి రోజున విచారించవలసి వస్తుంది.

2. ఇండియా ప్రభుత్వం "సత్యమేవ జయతే" అనే ప్రాచీన సూక్తిని ఆదర్శంగా స్వీకరించింది. ఎప్పటికైనా సత్యం జయించి తీరుతుంది. న్యాయ నిర్ణయ దినాన ఈ సూక్తి అక్షరాల నెరవేరుతుంది. ఆ రోజున సత్యం గెలుస్తుంది. అబద్ధం వోడిపోతుంది. దుర్మారుగులకు శిక్షా సజ్జనులకు బహుమతీ లభించి తీరుతాయి. తాత్కాలికంగా అసత్యం గెలవవచ్చు, మనచుటూ ఉన్నవాళ్లు అక్రమపద్ధతిలో లాభాలు గడించవచ్చు. వాళ్ళను జూచి మనంగూడ ప్రలోభానికి లొంగి అక్రమ పద్ధతులకు పాల్పడబోతాం. కాని ఇది పొరపాటు. అక్రమమార్గాలవల్ల ఇప్పడు తాత్కాలిక లాభం కలిగినా చివరకు న్యాయ నిర్ణయదినాన మన దుర్మార్గం రుజువెతుంది. శిక్షపడుతుంది. కనుక మనం సత్యమార్గాన్ని ఏనాడు విడనాడకూడదు. దుషుల దుష్కార్యాలను జూచి ప్రలోభం చెందకూడదు. 73వ కీర్తన ఈ సంగతినే చెప్తుంది.

"నేను గర్వాత్మలనుగాంచి అసూయ జెందాను

దుర్మారులు వృద్ధిలోనికి వస్తున్నారని గ్రహించి
ప్రలొభంలొ జిక్కుకొన్నాను
జారిపడిపోవడానికి సంసిద్ధుడ నయ్యాను
దుపులు సంపన్నులౌతున్నారు

267