పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. సాధారణ తీర్పు ప్రధానంగా సంఘిభావం కొరకు ఉద్దేశింపబడిందని చెప్పాం. ప్రభువు తన జ్ఞానశరీరానికంతటికీ కలిపి తీర్పు తీరుస్తాడని చెప్పాం. కనుక ఈ జీవితంలో తోడి నరులను పట్టించుకోవడమూ, సోదర ప్రేమను పాటించడమూ చాల ముఖ్యం. ఇండియాలాంటి పేదదేశంలో ఉన్నవాళ్ళు లేనివాళ్ళను ఆదుకొంటూండాలి. మనకు నాల్లు ముద్దలుంటే ఏమిలేనివాడికి ఓ ముద్దపెట్టాలి.

6. మనం న్యాయాధిపతియైన దేవుణ్ణిజూచి భయపడాలి. అతడు ఏ నరునికీ పక్షపాతం చూపించడు. ఎవరినీ వదిలిపెట్టడు. మన పాపపుణ్యాలకు తగినట్లుగా మనకు ప్రతిఫలమిస్తాడు. అంచేత మనం నిరంతరమూ భయభక్తులతో జీవించాలి. ఇప్పడు భయంతో జీవించేవాడు మరణాంతంలో వచ్చే న్యాయనిర్ణయ సమయంలో భయపడనక్కరలేదు.

3. నరకం

నరుల్లో కొందరు బుద్ధిపూర్వకంగా దేవుని రక్షణాన్ని నిరాకరిస్తారు. నిత్యజీవాన్ని పోగొట్టుకొంటారు. దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోతారు. ఇదే నరకం. ఈ అధ్యాయంలో రెండంశాలు పరిశీలిద్దాం.


1. తొలి మూడు సువిశేషాల భావాలు

క్రీస్తు తన బోధల్లోను సామెతల్లోను నరకాన్ని చాలసార్లు ప్రస్తావించాడు. ఒక్క మత్తయినే తీసికొంటే, గోదుమలు కలుపు మొక్కలు అనే సామెతలో పాపాత్ములను అగ్నికుండంలో పడద్రోసారు - అక్కడ ఆ పాపులు ఏడుస్తూ పంద్లుకొరుకుకొంటారు - 13,42. పెండ్లివిందు అనే సామెతలో వివాహవస్త్రం లేకుండా వచ్చినవాడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకటిలోనికి త్రోసివేసారు. అక్కడ అతడు విలపిస్తూ పండ్ల కొరుకుకుంటాడు22,13. పదిమంది కన్యలు అనే సామెతలో పెండ్లి కుమారుడు ఐదుగురు కన్యలను వివాహశాల నుండి బహిష్కరిస్తూ నేను మిమ్మ ఎరుగనే ఎరుగను అనిపల్మాడు - 25,12 యూదుల సంప్రదాయం ప్రకారం శిష్యులేమైనా తప్పచేస్తే రబ్బయిలు వాళ్ళను శిష్యబృందం నుండి ఏడునాళ్ళపాటు బహిష్కరించి ఈ మాటలు పలికేవాళ్లు. కనుక ఇక్కడ ఈ వాక్యంలో పెండ్లికుమారుడు ఈ యైదుగురు కన్నెలను తన సన్నిధిలోనుండి బహిష్కరించాడు అనుకోవాలి. ముగ్గురు సేవకులు అన్న సామెతలో డబ్బుని వృథాగా నేలలో పాతిపెట్టిన 269