పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5.గొర్రెపిల్లవలె వధ్యస్థానమును కొనిపోబడినది ఎవరు?
6.ఏ నగరము సమీపమున ఉత్థాన క్రీస్తు పౌలునకు దర్శనమిచ్చెను?
7.పౌలు డమస్కు పట్టణమున ఏ వీధిలో వసించెను?
8.పౌలునకు జ్ఞానస్నాన మిచ్చినది ఎవరు?
9.పౌలు శిష్యులు పౌలుని డమస్కునుండి ఎట్లు బయటికి పంపిరి?
10.యరుశాలమున పౌలును అపోస్తలులకు పరిచయము చేసినది ఎవరు?

46. యెరూషలేము క్రైస్తవ సమాజము అ.చ. 1-8

1.యూదాకు బదులుగా 12వ అపోస్తలుడుగా ఎన్నికైన శిష్యుడు ఎవరు?
2.ఆత్మ దిగిరాకముందు యెరూషలేమున క్రీస్తు శిష్యులు ఎంతమంది యుండిరి?
3.ఆత్మ దిగివచ్చి పేత్రు ప్రసంగము చేసిన పిదప యెరూషలేమున ఎంతమంది జ్ఞానస్నానము పొందిరి?
4.దేవాలయమున "అందమయినది" అనుద్వారము నొద్ద పేత్రు ఏమి యద్భుతము చేసెను?
5.యూదులు విచారణసభ అపోస్తలులను చంపగోరగా వారిని చంపవలదని సలహా యిచ్చిన పరిసయుడు ఎవరు?
6.మొట్టమొదటి వేదసాక్షిగా మరణించిన దెవరు?
7.సైఫనుని రాళ్ళతో కొట్టినవారు తమ వస్త్రములను ఎవరివద్ద ఉంచిపోయిరి?
8.గాజామార్గమందు ఫిలిప్ప ఎవరికి జ్ఞానస్నానమిచ్చెను?
9.యెరూషలేమన అపోస్తలులు ఉమ్మడి జీవితము గడుపుచుండగా తన ఆస్తినమ్మి, వచ్చిన పైకమును అపోస్తలులకు ఇచ్చిన దెవరు?
10. పేత్రు యెదుట బొంకి ప్రాణములు కోల్పోయిన భార్యాభర్తలు ఎవరు?

47. క్రీస్తు శిష్యులు

ఈ క్రిందివారు ఎవరు?

1. క్రీస్తు ఇతనితో "నీవు రాయివి. ఈ రాతిమీద నా సంఘమును నిర్మించెదను" అని చెప్పెను.
2.ఇతడు క్రీస్తుతో "ఇక్కడ ఒక బాలునివద్ద ఐదు యవధాన్యపు రొట్టెలు, రెండు చేపలు కలవు" అని పల్కెను. 3.పాస్క భోజనమును సిద్ధము చేయుటకు ప్రభువు పేత్రుతోపాటు ఇతనినికూడా పంపెను.
4.హెరోదు ఈ భక్తని కత్తితో చంపించెను.