పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3.క్రీస్తు పరలోకమునకు కొనిపోబడినపుడు అతనిని ఏమి కమ్మివేసెను?
4. క్రీస్తు మోక్షారోహణము చేసిన పిదప శిష్యుల సంఖ్య ఎంత?
5. మత్తీయతోపాటు అపోస్తలుల పదవికి పోటీ చేసిన దెవరు?
6.ఏ పండుగ దినమున ఆత్మ అపోస్తలుల మీదికి దిగి వచ్చెను?
7.అంత్యదినములలో నరులందరిమీద నా యాత్మను కుమ్మరించెదనని ప్రవచించిన పూర్వవేద ప్రవక్తయోవరు? 8.దేవాలయములోని ఏ ద్వారమవద్ద పేత్రు కుంటివానికి నడచెడు శక్తినిచ్చెను?
9.విచారణ సభ పెట్టెడి కష్టములలో అపోస్తలులు ధైర్యము కొరకు ప్రార్ధింపగా, వారున్న స్థలమునకు ఏమి జరిగెను?
10.బర్నబా అను పేరునకు అర్థమేమి?

44. అపోస్తలుల చర్యలు 5-8

1.అననీయా సఫీరాల నేరమేమిటి?
2.ప్రధానార్చకులు చెరలో పెట్టించిన అపోస్తలులను ఎవరు విడిపించిరి?
3. అపోస్తలులను చెరనుండి వదిలివేయుడని సలహా యిచ్చిన ధర్మశాస్త్ర బోధకుడు ఎవరు?
4.విచారణ సభవారు కొరడాలతో కొట్టింపగా అపోస్తలులు ఎందుకు సంతసించిరి?
5. యెరూషలేములోని క్రైస్తవులకు సేవలు చేయుటకు ఎందరు పరిచారకులను నియమించిరి?
6.శత్రువులు సైఫనుని న్యాయసభ అధికారుల యెదుటికి తీసికొనిరాగా అతని ముఖము దేనివలె కన్పించెను?
7.సైఫనుని ఏ రీతిగా చంపిరి?
8.సైఫనుని చంపినవారు తమ వస్త్రములను ఎవరివద్ద ఉంచిరి?
9. అతడు చనిపోవుచు శత్రువుల కొరకు ఏమని ప్రార్థించెను?
10. సైఫను మరణానంతరము క్రైస్తవ సంఘము ఏమి విపత్తుల పాలయ్యెను?

45. అపోస్తలుల చర్యలు 8 –9

1.ఫిలిప్ప ఏ నగరమున సువార్తను బోధించి అద్భుతములు చేసెను?
2. నీవు నీ డబ్బుతోపాటు నాశమగుదువుగాక అని పేత్రు ఎవరిని తిట్టెను?
3. ఫిలిప్ప ఏ మార్గమందు యితియోపీయుని కలిసికొనెను?
4. ఇతియోపీయుడు ఏ ప్రవక్త గ్రంథమును చదువుచుండెను?