పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5.క్రీస్తు ఇతనిని సుంకపు మెట్టునుండి పిలచెను.
6. ఇతనికి దిదీము అను రెండవ నామము కలదు
7. క్రీస్తు ఇతనితో "నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్లే" అని చెప్పెను.
8. యూదాకు బదులుగా ఇతడు పండ్రెండవ శిష్యుడు అయ్యెను.
9. ఇతడు అన్యజాతి జనులకు అపోస్తలుడు.
10. క్రీస్తుకు పండ్రెండు మంది శిష్యులతోపాటు వేరొక శిష్యవర్గముకూడ కలదు. వీరు ఎంతమంది?

48. పేత్రు జీవితము

1.పేత్రు అన్న పేరేమి?
2.పేత్రు సొంత పేరేమి? అతనికి క్రీస్తు పెట్టిన పేరేమి?
3.క్రీస్తు వ్యాధినయము చేసిన పేత్రు బంధువు ఎవరు?
4. పేత్రు దేనిమీద నడవబోయి విఫలుడయ్యెను?
5. నేనెవరినని మీరు భావించుచున్నారు అని యేసు అడగగా, పేత్రు చెప్పిన జవాబు ఏది?
6.పేత్రు కొండమీద క్రీస్తు మోషే యేలీయాలకు ఏమి నిర్మింప గోరెను?
7. గెత్సెమని తోపులో అతడు ఎవరి చెవిని తెగనరికెను?
8.పేత్రు బొంకుకు ఒక పక్షికి సంబంధమున్నది. ఆ పక్షి యేది?
9.నా వద్ద వెండిబంగారములు లేవు అని అతడు ఎవరితో ఆమెను?
10.అతడు క్రీస్తుని బోధించిన రోమను సైన్యాధిపతి పేరేమి?

49. పౌలు వాక్యాలు

ఈ క్రింది వాక్యాలలోని ఖాళీలను పూరింపుడు.

1.మనము పాపాత్ములమై యున్నపుడు క్రీస్తు మన కొరకు . . . .
2. ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు . . . .
3. ప్రభువు వచ్చువరకు మీరు ఆయన . . . . ప్రకటింతురు.
4. సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో . . . .
5.ఎవడైనను క్రీస్తునందున్న యెడల అతడు నూత్న సృష్టియగును. ప్రాతజీవితము గతించినది . . . . ప్రారంభమైనది.