పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7.ఒడిసెల రాతిదెబ్బ
8.కొండమీద పొట్టేలును బలియిచ్చుట
9.కోడిక్షూత
10.మేడిచెట్టు నెక్కట

19.బైబులు వాగ్దానాలు

ఈ క్రింది వాగ్దానములను ఎవరు ఎవరికి చేసిరి?
1.నేను నిన్నొక మహాజాతినిగా తయారుచేయుదును.
2.ప్రభువును నమ్మినవారు పక్షిరాజువలె రెక్కలు చాచి పైకెగురుదురు.
3.నన్ను ప్రేమించువారిని దీర్ఘయువుతో సంతృప్తి పరచెదను.
4.నా కృప నీకు చాలును. బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగును.
5.నేను నీకు వివేకము విజ్ఞానము ప్రసాదింతును.
6.యెరూషలేము వీధులు మరల ఆటలాడుకొను బాలబాలికలతో నిండియుండును.
7.నేను లోకాంతము వరకు మీతో నుందును.
8.నీవ రాయివి. ఈ రాతిమీద నా సంఘమును నిర్మించెదను.
9.ఎక్కడ యిద్దరు ముగ్గురు నా పేరిట కూడుదురో అక్కడ నేనును ఉందును.
10.నేడే నీవు నాతోకూడ పరలోకము ప్రవేశింతువు.

20. బైబులు గ్రంథాలు

1.ఈ పుస్తకము పేరు గణిత శాస్త్రమున వచ్చును.ఇది యేది?
2.లోకసృష్టిని యిస్రాయేలీయుల జన్మవృత్తాంతమును తెలియజేయు పుస్తకమేది?
3.ఒక అందమైన రాణి పేరు కల పొత్తమేది?
4.ఒక రాజు ప్రేమగీతాల గ్రంథమేది?
5.అంత్యదినాలలో ఆత్మ ఎల్లరిమీదికి దిగివచ్చునని చెప్పెడు గ్రంథమేది?
6.చేప మింగీవేసిన కథానాయకుడుగల గ్రంథమేది?
7.యిస్రాయేలీయుల పాటల పుస్తకమేది?
8.మోవాబు పుణ్యస్త్రీ కథను వర్ణించు గ్రంథ మేది?
9.తియొఫిలుకు అంకితమీయబడిన సువిశేషమేది?
10.సుంకరి వ్రాసిన సువిశేషమేది?