పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21.ఆదికాండము

1.జంతువులకు పక్షులకు మొదట పేర్లుపెట్టిన దెవరు?
2.జలప్రళయము సమసిపోయినదని నోవా యెట్ల తెలిసికొనెను?
3.నీ సంతతిని యిసుక రేణువులవలె వృద్ధిచేయుదును అని ప్రభువు ఎవరికి మాట యిచ్చెను? 4.దుర్మార్గులతోపాటు నీతిమంతులనుగూడ నాశము చేయుదువా అని దేవుని ప్రార్ధించిన దెవరు?
5.ప్రభువు యాకోబునకు పెట్టిన క్రొత్త పేరేమిటి?
6.పొడుగుచేతులు నిలువుటంగీ కల యువకుడెవరు?
7.బక్కచిక్కిన ఆవులు బలసిన యావులను తిన్నట్లుగా కలగాంచిన దెవరు?
8.ఫరో యోసేపకి పెట్టిన పేరేమిటి?
9.యోసేపు బెన్యామీనుల తల్లి యెవరు?
10.యోసేపు భార్య పేరేమి?

22.నిర్గమ కాండము

1.మోషేశిశువు తల్లి ఇతనిని ఏ నదిలో వదిలిపెట్టెను?
2.మోషేను దత్తుతీసుకొని పెంచిన దెవరు?
3.అతడు "నేను దగ్గరికి వెళ్ళి చూచెదను" అనుకొన్నది దేనిని గూర్చి?
4.ఫరో కట్టకడన యిప్రాయేలీయులను ఈజిప్టునుండి ఎందుకు వెళ్ళిపోనిచ్చెను?
5.యిస్రాయేలీయులు దాటిపోయిన సముద్రము పేరేమి?
6.ఐగుప్తనుండి బయలుదేరకముందు యిస్రాయేలీయులు దేనిని భుజించిరి?
7.మోషే రాతినుండి నీటిని రప్పించిన తావేది?
8.బంగారు దూడను చేసిన దెవరు?
9.మోషేమీద తిరగబడినందులకు శిక్షగా మిర్యాముకు ఏమి వ్యాధి సోకెను?
10.యిస్రాయేలీయులు ఎడారిలో భుజించిన రెండు ఆహారములు ఏవి?

23. క్రీస్తు జననము

1.క్రీస్తు బేత్లెహమున జన్మించునని ప్రవచించిన ప్రవక్త ఎవరు?
2.క్రీస్తు జననకాలమున జనాభా లెక్కలు తయారు చేయించిన రోమను చక్రవర్తి వరు?