పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5.పేత్రు అంద్రెయ యాకోబు యోహానుల వృత్తి ఏది?
6.క్రీస్తు వస్త్రముల కొరకు చీట్లువేసినవారి వృత్తి యేది?
7.యొప్పాలో పేత్రును అతిథిగా స్వీకరించిన సీమోను వృత్తి యేది?
8.క్రీస్తును చూచుటకు చెట్టుపై కెక్కిన జక్కయ వృత్తి యేది?
9.క్రీస్తు బోధల ప్రకారము ఆరోగ్యవంతులకు అక్కర లేనివాడెవడు?
10.పౌలు ఏ వృత్తిచే జీవించెను?

17. బైబులు బాలలు

ఈ క్రింది బాలలెవరో తెలుపడు
1.ఇతని తల్లి ఇతనిని ఎడారిలో ఒక పొద క్రింద పరుండబెట్టెను.
2.ఇతడు బాలుడుగా నున్నపుడే కలలు కనెను.
3.సోదరులందరిలో కడగొట్టవాడైన ఇతడు పుట్టినపుడు ఇతని తల్లి చనిపోయెను.
4.రాజకుమారి ఇతని తల్లినే ఇతనికి దాదిగా నియమించెను.
5.దేవళములో పెరుగుచున్న ఇతనికి ఇతని తల్లి ప్రతియేడు క్రొత్త అంగీని కుట్టుకొని వచ్చెడిది.
6.ఏడ్గురు అన్నలున్నను ఈ కడగొట్టవాడు రాజయ్యెను
7.ఎలీషా ప్రవక్త కుష్ట నయముచేయునని ఈమె నామానునకు తెలియజేసెను.
8.ఇతడు జన్మించువరకు ఇతని తండ్రి మూగవాడుగా నుండెను.
9.పండ్రెండేడ్ల యిూడున తలిదండ్రులతో యెరూషలేము వెళ్ళిన బాలుడు.
10.క్రీస్తు జీవముతో లేపిన బాలిక.

18. బైబులు కథలు

ఈ క్రింది మాటల వలన బైబులులోని ఏ వ్యక్తులు మీకు జ్ఞప్తికి వచ్చెదరో తెలుపడు.
1.జీవవృక్ష ఫలము
2.ఇంద్రధనుస్సు
3.సింహముల గుంట
4.మండుచున్న పొద
5.చేపకడుపులో మూడునాళ్ళు
6.అగ్ని రథము నెక్ముట