పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజలు గోతిలో పడ్డానికీ, బంధాల్లో చిక్కుకోడానికీ విగ్రహాలు కారణమయ్యాయి. కనుక ప్రతిమలూ వాటిని చేసిన నరులూకూడ శాపగ్రస్తులౌతారు.

నరుడు చేసిన కొయ్య విగ్రహమూ
దాన్ని చేసిన నరుడూ శాపగ్రస్తులౌదురుగాక
అతడు నశ్వరమైన వస్తువుని జేసి
దాన్ని దేవుడని పిలుస్తున్నాడు
దుష్టులనూ వారు చేసిన దుష్టవస్తువులనూ గూడ
ప్రభువు ద్వేషిస్తాడు
పనివానినీ వాడు చేసిన పనినీగూడ దేవుడు శిక్షిస్తాడు
అన్యమతస్తుల విగ్రహాలకు దేవుడు తీర్పు తీరుస్తాడు
అవి ఆ దేవుడు కలిగించిన సృష్టివస్తువులైనా
హేయమైన వస్తువులయ్యాయి
ప్రజలు గోతిలో పడ్డానికీ,
మూర్ఖులు బంధాల్లో చిక్కుకోడానికీ, కారణాలయ్యాయి - 14, 8-11.

కుమ్మరిచేసే బొమ్మలను విగ్రహాలుగా భావించి కొల్చేవాళ్లు మూర్ఖులు. మనకు ఉపయోగపడే కుండలను తయారుచేసే మట్టితోనే అతడు బొమ్మనుకూడచేసి దానికి దేవుడని పేరు పెడతాడు. ఒకే మట్టినుండి పగిలిపోయే కుండనూ విగ్రహాన్నీ కూడ చేసేవాడు తాను చేసేపని తప్పని గ్రహించి తీరుతాడు. ఐనా ధనాపేక్షతో అతడు విగ్రహాలు చేస్తాడు. జనులు మూర్ఖులై వాటికి మొక్కుతారు.

కుమ్మరి మెత్తని మట్టిని మలచి
మనకుపయోగపడే పరికరాలను చేస్తాడు
అతడు కొలదికాలం క్రితమే మట్టినుండి చేయబడినవాడు
కొలది కాలమయ్యాక, తనకీయబడిన ఆత్మను
తిరిగి దేవునికి ఒప్పగించవలసిన సమయం వచ్చినపుడు,
ఆ మట్టిలోనే కలసిపోతాడు
ఆలాంటివాడు ఆ మట్టినే తీసుకొని
వ్యర్ధప్రయాసతో నిరర్థకమైన దైవాన్ని మలుస్తాడు
ఆ కుమ్మరి కొలదికాలం మాత్రమే జీవించి
త్వరలోనే చనిపోయేవాడు
కాని అతడా విషయం ఏ మాత్రం తలపోయడు
అతని హృదయం బూడిదప్రోవు వంటిది,