పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతని ఆశ మురికికంటె హేయమైంది,
అతని జీవితం మట్టికంటె నీచమైంగి,
అతడు క్రియాశీలకమూ ప్రాణమయమూఐన ఆత్మను
తనలోకి వూది
తన్న మలచిన దేవుని అర్థం చేసికోలేదు
అతడు నరజీవితాన్ని ఓ ఆటలా,
డబ్బు సంపాదించే అంగడిలా ఎంచాడు
దుష్టమార్గాన్ని అవలంబించైనా సరే
సొమ్ము జేసికోవాలని యెంచాడు
ఒకే మట్టినుండి విగ్రహాలనూ
పగిలిపోయే పాత్రలనుగూడ చేసేవాడు
తాను చేసే పని పాపకార్యమని
తప్పక గ్రహిస్తాడు కదా?- 15, 7-13.

విగ్రహాలు శక్తిరహితాలు. అవి కండ్లున్నా చూడలేవు. చెవులున్నా వినలేవు. కాళ్ళన్నా నడవలేవు. నరుళ్లోనైన జీవముంటుంది కాని అతడు చేసే ప్రతిమల్లో అసలు జీవమే వుండదు. కనుక వాటిని పూజించడం వ్యర్థం.

విగ్రహాలు తమ కంటితో చూడలేవు
నాసికతో గాలి పీల్చుకోలేవు
చెవులతో వినలేవు
వ్రేళ్ళతో తాకి చూడలేవు
కాళ్ళతో నడవలేవు
నరమాత్రు డొకడు వాటిని చేసాడు,
తనలోని శ్వాసను ఎరువుతెచ్చుకొన్నవా డొకడు
వాటిని మలచాడు
ఏ నరుడూ తనకు సరిసమానమైన వేల్పును చేయలేడు
మర్త్యుడు తన పాపపు చేతులతో చేసే
బొమ్మలుకూడ చచ్చినవే
నరుడు పూజించే బొమ్మలకంటె నరుడే ఘనుడు
అతనిలో నైనా జీవం వుందికాని