పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆమె చేతజిక్కి చచ్చినవాళ్ళ అనేకులున్నారు
        ఆమె యింటికి పోవడమనగా పాతాళానికి పోవటమే - సామె 7, 22-27

.}}

నరుడు తనంటతట తాను కామ వికారాన్ని అణచుకోలేడు. కనుకనే రచయిత భగవంతునికి ఈలా ప్రార్ధన చేసాడు.

నాకు తండ్రివీ
      నా జీవనానికి దేవుడవూ ఐన ప్రభూ!
      అహంకారం నుండి నన్ను కాపాడు
      నా హృదయంనుండి కామాగ్ని తొలగించు
      నేను మోహానికి లొంగకుండేలానూ
      సిగ్గుమాలి కామవికారానికి లోపడకుండేలానూ కరుణించు - సీరా 23, 4-6.

36. గర్వం

నరులకు సులభంగా అలవడే దురుణం గర్వం. పాపంతో గర్వం ప్రారంభమైంది. గర్వాత్ముడు దేవుణ్ణి నిరాకరిస్తాడు. ప్రభువు రాజులను సింహాసనాలమీదినుండి కూలద్రోస్తాడు. వినయాత్మలను గద్దెనెక్కిస్తాడు.

సృష్టికర్తయైన ప్రభువుని విడనాడ్డం గర్వానికి తొలిమెట్టు
      పాపంతో గర్వం ప్రారంభమౌతుంది
      గర్వితులుగానే మనుగడ సాగించేవాళ్లు మహా దుషులౌతారు
      ప్రభువు అట్టివారిని తీవ్రశిక్షకు గురిచేసి సర్వనాశం చేస్తాడు
      అతడు రాజులను సింహాసనంనుండి కూలద్రోసి
      వినయాత్మలను గద్దెనెక్కిస్తాడు - సీరా 10,12-14

నరుడు ఆశాపాశాలకు లొంగకూడదు. వాటిల్లో గర్వంకూడ వొకటి. ఈ దుష్టశక్తులను తావిచ్చేవాళ్ల సమూలంగా ఎండిపోయిన చెట్టలా నాశమౌతారు.

ఆశాపాశాలకు తావీయకు
      అవి నిన్ను ఎద్దుకొమ్మలతోవలె పొడుస్తాయి
      నీవు ఎండిపోయి, ఆకులను పండ్లను కోల్పోయిన
      చెట్టువంటివాడ మోతావు
      ఆశాపాశాల వలన నరుడు చెడతాడు
      నీ శత్రువులు నిన్ను జూచి నవ్వుతారు - సీరా 6, 2-4