పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేశ్యకు కొద్దిపాటి సొమ్ము చెల్లిస్తే చాలు
          కాని పరుని భార్యతోడి రంకు
          నీ యాస్తినంతటినీ అపహరిస్తుంది
          నిప్పలను రొమ్ముమీద పెట్టుకొంటే బట్టలు కాలవా?
          అగ్నిమీద నడిస్తే సాదాలు మాడవా?
          అన్యుని భార్యను కూడేవాడూ అంతే
          ఆమెను స్పృశిస్తే శిక్ష తప్పదు
          దొంగ ఆకలితో పొట్టకూటికొరకు దొంగిలిస్తే
          జనులతనిని అంతగా దూషించరు
          కాని పరుని సతిని కూడేవానికి అసలు బుద్ధిలేదు
          అతడు తన చావుని తానే తెచ్చుకొంటాడు
          అతన్ని జనులు చావమోది అవమానిస్తారు
          శాశ్వతమైన అపకీర్తి కలుగుతుంది
          అసూయకు గురైన భర్త రౌద్రంతో మండిపడతాడు
          కరుణమాని ప్రతీకారానికి పూనుకొంటాడు. - సామె 6,25-35.


సామెతల గ్రంథం 7వ అధ్యాయం వారకాంత వలపు, యువకులు ఆమె వలలో చిక్కుకొని నాశంకావడం కన్నులకు కట్టినట్లుగా వర్ణిస్తుంది. పాఠకులు ఈ యధ్యాయాన్నంతటినీ చదువుకోవాలి. గ్రంథవిస్తరణభీతిచే ఇక్కడ ఈ యధ్యాయంలో చివరి వాక్యాలను మాత్రం ఉదాహరిస్తున్నాం.

ఇకనేమి, కోడె వధ్యస్థానానికి పోయినట్లే,
లేడి వచ్చులలో తగుల్కొన్నట్లే
అతడు ఆ వారకాంత యింటికి బోయాడు
వాడిబాణం అతని గుండెలో గ్రుచ్చుకోనుంది
వలలో చిక్కుకోబోయే పక్షిలాగ
అతని ప్రమాదం అతనికే తెలియదు
కనుక కుమారా! నా పలుకులు ఆలించు
నా మాటలు శ్రద్ధగా విను
హృదయాన్ని అట్టి వనితకు అర్పింపకు
నీవు ఆమె వెంట పోవద్దు
ఆ కాంత పూర్వం చాలమందికి ముప్ప తెచ్చింది