పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన సంపదలనూ గౌవవాలనూ అందమైన దుస్తులనూ జూచి మనం మురిసిపోకూడదు. మనం ఎప్పడు పడిపోతామో మనకే తెలియదు. రాజులే బిచ్చగాళ్ళయ్యారు.

నీ నాణెమైన దుస్తులనుజూచుకొని మురిసిపోకు
     నీకు గౌరవం అబ్చినపుడు పొగరుబోత్సువి కావద్దు
     ప్రభువు అద్భుత కార్యాలు చేస్తాడు
     వాటిని నరులు తెలిసికోలేరు
     చాలమంది రాజులు గద్దెదిగి నేలమీద కూర్చున్నారు
     ఎవరూ ఊహింపనివాళ్లు వచ్చి
     ఆ రాజుల కిరీటాలు ధరించారు
     పాలకులు చాలమంది అవమానం పొందారు
     సుప్రసిద్దులు చాలమంది
     అన్యులశక్తికి లొంగిపోయారు - సీరా 11,4-6.

గర్వాత్ముడి లక్షణం ఆత్మస్తుతీ, పరనిందా. కాని యిది తగదు.
       ఇతరులు నిన్ను పొగడవచ్చుగాని
       నిన్ను నీవే పొగడుకోగూడదు
       పరులు నిన్ను స్తుతించవచ్చుగాని
      ఆత్మస్తుతి పనికిరాదు - సామె 27.2

గర్వాత్మడు డాబూ దర్పమూ ప్రదర్శిస్తాడు. “మింగమెతుకు లేదుగాని మీసాలకు సంపెంగనూనె" అన్నట్లుగా వుంటుంది అతని వాలకం.

నీవు పనిచేసేపుడు
      నీ ప్రావీణ్యాన్ని ప్రదర్శింప నక్కరలేదు
      ఇక్కట్టులలో వున్నపుడు డాబుసరి పనికిరాదు
      ప్రగల్భాలు పలుకుతూ ఆకటితో చావడంకంటె
      కష్టపడి పనిచేసి పొట్టనిండ తినడం మేలు - సీరా 10, 26 -27.

భవిష్యత్తులో మనకు ఏలాంటి దుర్గతి పడుతుందో మనకే తెలియదు. క్షణకాలంలోనే మన పరిస్థితి మారిపోతుంది. కనుక మనకు గర్వం పనికిరాదు.

నరుడు, ఇక శ్రమచేయడం చాలించి
     నే నార్జించిన సొత్తుని అనుభవిస్తానని యెంచవచ్చు

}}