పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

31. సోమరితనం

సోమరితనం చాలమందిని ఆవహిస్తుంది. కొందరికి మాటలెక్కువ, చేతలు తక్కువ. సోమరిపోతు చీమలను జూచి బుద్ధి తెచ్చుకోవాలి. పై అధికారి తనిఖీ చేయకపోయినా అవి నిరంతరం కష్టపడి పనిచేస్తుంటాయి. పని చేయనివాడు వినాశానికి తమ్ముడౌతాడు. వాడు బయట సింహముంది, కనుక నేను వీధిలోకి పోను అంటాడు. సోమరిపోతు పొలం పండదు. వాడు కంచంలోని అన్నాన్ని పైకెత్తి నోటితో పెట్టుకోవడమనే చిన్నపని చేయడానికి గూడ ఇష్టపడడు.

మాటలలో దిట్టతనం జూపి
    క్రియలో సోమరితనం జాప్యంచూపడం పనికిరాదు
    ప్రగల్భాలు పల్కుతూ ఆకటితో చావడంకంటె
    కష్టపడి పనిచేసి
    నిండుగా తిండి సంపాదించుకోవడం మేలు.
    సోమరీ! చీమలను జూడు
    వాటి జీవితాన్ని జూచి బుద్ధి తెచ్చుకో
    వాటికి నాయకుడు లేడు,
    పర్యవేక్షకుడు లేడు, అధికారి లేడు
    ఐనా అవి వేసవిలో ఆహారం చేకూర్చుకొంటాయి
    కోతకాలంలో ధాన్యం చేకూర్చుకొంటాయి
    సోమరీ! నీ వెంతకాలం పండుకొంటావు?
    ఎప్పుడు నిద్రమేల్కొంటావు?
    ఇంకా కొంచెంసేపు కన్నుమూసి
    కొంచెం నిద్రించి
    కొంచెం చేతులు ముడిచి
    విశ్రాంతి తీసుకోగోరుతావు కాబోలు
    కాని యింతలోనే దారిద్ర్యం
    దోపిడికానివలె నీ మీదికి వస్తుంది
    పేదరికం ఆయుధహస్తునివలె
    నీ మీదికి ఎత్తివస్తుంది.
    పనిచేయని సోమరిపోతు

                     117