పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వర్తకుడు దుష్కార్యం చేయకుండ వుండలేడు ప్రతివ్యాపారి పాపానికి పాల్పడతాడు లాభాన్ని గణించాలన్న పేరాసతో చాలమంది పాపంజేసారు ధనికుడు కాగోరేవాడు కండ్లు మూసికోవాలి బిగించిన రెండు రాళ్ళ మధ్య మేకు ఇరుకుకొని వున్నట్లే

క్రయవిక్రయాల నడుమ
అన్యాయం దాగుకొని వుంటుంది
నరుడు దైవభీతికి లొంగకపోతే
వాని యిల్ల వానిమీదనే కూలిపడుతుంది.
తప్పుడు తూనికలను ప్రభువు అసహ్యించుకొంటాడు
నిండు తూనికలవలన అతడు ప్రమోదం చెందుతాడు
పూర్వులు పాతించిన గట్టురాళ్ళను కదిలించకు
అనాథుల పొలాలను ఆక్రమించుకోకు.
లంచాలు అన్యాయాలు అడుగంటిపోతాయి
ధర్మం మాత్రమే నిలుస్తుంది
లంచం మంత్రంలాగ పనిచేస్తుంది
అది సాధించిపెట్టని కార్యంలేదు.
కుమారా! నీవు ముష్టి యెత్తుకొని బ్రతకవద్దు
తిరిపెంకంటె చావు మేలు
కూటికోసం ఇతరులమీద ఆధారపడేవాడి జీవితం
అసలు జీవితమే కాదు
అన్యుల కూడు తినేవాడు
తన్నుతాను మైలపరచుకొంటాడు
గౌరవమర్యాదలు కలవాడు ఆ పనికి పాల్పడడు
సిగ్గుసెరం లేనివాడు
బిచ్చమెత్తుకోవడం మంచిదే అంటాడు
కాని తిరిపెం అతని కడుపుకి చిచ్చుపెడుతుంది.
- సీరా 26,29. 27,1-3. సామె 11,1. 23,10. సీరా 40,12. సామె 17,8. సీరా 40, 28-31.
                           116