పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యూదితు గొప్ప దైవభక్తి కలది. హోలోఫెర్నెసు అనే అస్సిరియా సైన్యాధిపతి బెతూలియా పట్టణాన్ని ముట్టడించడానికిరాగా ఆమె సాహసంతో వెళ్ళి ఆ సైన్యాధిపతి శిరస్సు తెగనరుక్కొని వచ్చింది. పౌరులందరికీ ఈలాంటి దేశభక్తి వుండాలి - యూది 12,8.

చాలామంది ధనాన్ని కూడబెడతారు. కాని దాన్ని సద్వినియోగం చేసికోవాలి. పిసినిగొట్టలు ఆలా చేసికోరు. కనుక వారు కూడబెట్టిన సాత్తును అన్యులు అనుభవిస్తారు. నరుడు ఉచితమైన సుఖాలను అనుభవించాలి.

తా ననుభవింపక సామ్మ కూడబెట్టేవాడు
ఇతరుల కొరకే కూడబెడుతున్నాడు
అతని సాత్తుతో ఇతరులు హాయిగా బ్రతుకుతారు
తన కొరకు తాను ఖర్చుజేసికోనివానికంటె నికృష్ణుడు లేడు
పిసినారితనానికి తగిన శిక్షే వుంది
లోభియైన నరుడు దుష్టుడు
అక్కరలో వున్న వారిని ఆదుకొనడు
అతడు తనకున్న దానితో తృప్తిజెందడు
దురాశ వలన అతని హృదయం కుదించుకొనిపోతుంది
పిసినారి కడుపునిండ తినడానికి ఇష్టపడడు
కనుక చాలినంత భోజనం సిద్ధంజేసికోడు
మృత్యువు నీ కొరకు వేచివుండదు
నీవేనాడు పాతాళం చేరుకొంటావో నీకే తెలియదు
ప్రతిదినం నీ వనుభవింపగలిగింది అనుభవించు
ఉచితాలైన నీవంతు సుఖాలను విడనాడకు
నీ సాత్తును ఇతరులకు వదలనేల?
నీవు కష్టపడి కూడబెట్టింది అన్యులు పంచుకోనేల? - సీరా 14, 4–6, 8–
 10. 12-16.

భక్తుడు తాను పేదవాడుగాని ధనికుడుగాని కాకుండ మధ్యస్థంగా జీవించాలని కోరుకొన్నాడు. ధనికుడైతే తాను దేవుణ్ణి పట్టించుకోకపోవచ్చు. పేదవాడైతే దొంగతనానికి పాల్పడవచ్చు. కనుక ఆ రెండింటికీ మధ్యలో వుండడం మంచిది.