పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవా! నేను నిన్ను రెండువరాలు అడుగుతున్నాను
నేను మరణించకముందే నాకు వీటిని ప్రసాదించు
నేనెంతమాత్రం అబద్దాలు ఆడకుండా వుండేలా చేయి
నన్ను సంపన్నుణ్ణీ చేయవద్దు, ధనికుణ్ణీ చేయవద్దు
నాకు కావలసినంత తిండి మాత్రం దయచేయి
నీవు సంపదలిస్తే నిన్ను ధిక్కరించి
ప్రభువెవడని పల్కుతానేమో!
లేమి కల్గితే దొంగతనానికి పాల్పడి
నా దేవుడవైన నీకు అపఖ్యాతి తెస్తానేమో! - సామె 30, 7-9

17. నరుల్లో తేడాలు

అందరూ ఒకే రీతిగా వుండరు. నరుల్లో తారతమ్యాలుంటాయి. కుమ్మరి తన కిష్టమొచ్చినట్లుగా పాత్రలను చేస్తాడు. అలాగే ప్రభువు అధికులనూ అల్పులనూ గూడ చేస్తాడు.

అందరూ మట్టినుండి పుట్టినవాళ్ళే
ఆదాముకూడ అలా జన్మించినవాడే
ఐనా ప్రభువు వివేకంతో నరులమధ్య వ్యత్యాసం కలిగించి
వారికి భిన్న కార్యాలు ఒప్పగించాడు
అతడు కొందరిని దీవించి ప్రముఖులను చేసాడు
కొందరిని పవిత్రపరచి తనయెదుట నిల్పుకొన్నాడు
కొందరిని శపించి మన్ను గరిపించి స్థానభ్రష్టులను చేసాడు
మట్టి కుమ్మరి చేతిలో వుంది
అతడు దాన్ని తన యిష్టం వచ్చినట్లు మలుస్తాడు.
ఆలాగే నరులుకూడ ప్రభువు చేతిలో వున్నారు
అతడు వారిని తన యిష్టంవచ్చినట్లు చేస్తాడు
మంచికి చెడ్డ, మృత్యువుకి జీవం, వ్యతిరేకాలు
ఆలాగే పాపికి పుణ్యాత్ముడు వ్యతిరేకి
మహోన్నతుడైన ప్రభువు కార్యాలను పరిశీలిస్తే