పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు అభిషిక్తుడుగా చలామణి ఔతాడు. కనుక అతని జీవితంగూడ ఈ యభిషేకానికి తగినట్లుగానే వుండాలి.

గురువు తన స్వార్థం కొరకు తాను జీవించగూడదు. ఇతరుల కొరకు జీవించాలి. అతడు క్ర్హిస్తావ సమాజం కొరకు ఉన్నవాడు. కనుక అతని క్రియలు వ్యక్తిగత లాభానికిగాక క్రైస్తవ సమాజ శ్రేయస్సుకు తోడ్పడేవిగా వుండాలి. ఈ ధ్యేయాన్ని విస్మరించిన గురువు తన ఉన్నత స్థానం నుండి పడిపోయాడనుకోవాలి. లాటిన్ శ్రీసభ గురువు వివాహాన్ని నిషేదిస్తుంది ఎందుకు? వివాహం చెడ్డదనిగాదు. అతడు అవివివాహితుడై వుంటే ఒక్క కుటుంబానికి బదులుగ అనేక కుటుంబాలను పరామర్శిస్తాడు అనే తలంపుతో, అతడు వందలకొలది, వేలకొలది దేవుని బిడ్డలను సాకాలన్న ఉద్దేశంతో కనుక గురువు ఇతరులకు నేనేపాటి సేవచేస్తున్నానా అని నిరంతరం తన్నుతాను ప్రశ్నించుకొంటూండాలి.

మనదేశంలో అన్ని మతాలవాళ్ళూ క్యాతలిక్ గురువుని గౌరవంతో చూస్తారు. ప్రజలు అతన్ని దేవునికీ నరునికీ మధ్య నిలిచే మధ్యవర్తినిగా గుర్తిస్తారు. అతడు తన ప్రార్థనాబలంతో దేవుని వరాలు తీసికొని రాగలడనీ, అతడు దీవించే దీవెన ఫలించి తీరుతుందనీ నమ్ముతారు. అతడు దేవుణ్ణి అనుభవానికి తెచ్చుకొన్న భక్తుడనీ, దేవుని గ్రంథమైన బైబులును పఠించి దాని భావాన్ని వివరింపగలడనీ ఎంచుతారు. ప్రపంచ వ్యామోహాలను విసర్జించి పరమపవిత్రంగా జీవించే ఋషి అని భావిస్తారు. కోపతాపాలను రాగద్వేషాలను విడనాడి సేవ, దయ, సానుభూతి మొదలైన మార్ణవ గుణాలతో లోకకళ్యాణం కొరకు జీవించే పుణ్యపురుషుడని ఎంచుతారు. గురువు ఈ వన్నతాశయాలకు అనుగుణంగా జీవించాలి. అంతేగాని వెర్రిమొర్రిపనులకు పాల్పడి ప్రజలకు తనమిూదవున్న సదభిప్రాయం వమ్మయిపోయేలా చేసికోగూడదు. ఐనా నేడు కొందరు గురువులు తమ అంతస్తుకు తగినట్లుగా జీవించలేక తలవంపులు తెచ్చుకొంటున్నారు. ఇది సజ్జనులందరికీ మనస్తాపం కలిగిస్తుంది.