పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గురువులు ప్రధానంగా తమ సేవద్వారానే పవిత్రులు కావాలి. అనగా ప్రజలను పవిత్రపరచడం, వారికి బోధచేయడం, వారిని నడిపించడం అనే త్రివిధ సేవద్వారా వాళ్లు పుణ్యాత్ములు కావాలి. కాని వాళ్లు రేయింబవళ్లు ఏవేవో సేవాకార్యాల్లో మునిగిపోయి వ్యక్తిగతమైన ప్రార్ధనం ఆత్మనిగ్రహం మొదలైన వాటిని అశ్రద్ధ చేయకూడదు.

రెండవ వాటికన్ సభ ప్రకారం, గురువులు విశేషంగా వినయవిధేయతలు, బ్రహ్మచర్యం, నిస్సంగత్వం, ఈ లోకపు విలువలపట్ల వివేకం, ఈ ప్రపంచంపట్ల మమకారం లేకుండా వుండడం, దారిద్ర్యం మొదలైన సదుణాలు కలిగివుండాలి. 

3) గురువు ఆధ్యాత్మిక జీవితం ఏలా వుండాలి? అతడు తన్ను తాను దానం చేసికొనేవాడై యుండాలి. నిరంతరం ఒకవైపు దేవునికీ ఒకవైపు ప్రజలకూ తన్నుతాను అర్పించుకొంటూండాలి.

ఆరాధనపరుడై యుండాలి. క్రీస్తుతో ఐక్యమై పూజబలిని అర్పిస్తుండాలి. ప్రార్ధనద్వారా రోజురోజుకి తనలోని స్వార్ణాన్ని తొలగించుకొంటూండాలి. తాను නි”ඝරයී దైవవాక్కుని తాను ముందుగా మననం చేసికొంటూండాలి.

నిరంతరం ప్రజలదగ్గరికి పంపబడినవాడై యుండాలి. తండ్రినన్ను పంపినట్లే నేను మిమ్మ పంపుతున్నాను అన్న క్రీస్తవాక్యం అతనికి అక్షరాల వర్తిస్తుంది.

తోడి గురువులపట్ల సోదరభావమూ బిషప్పపట్ల పితృభావమూ కలిగి వుండాలి. అతని మనుగడ తిరుసభతో ముడిపడివుండాలి.

సంగ్రహంగా చెప్పాలంటే, అతని ఆధ్యాత్మిక జీవితం మధ్యవర్తికి చెందిందై వండాలి. అతడుఎల్లపుడు దేవునికీ నరునికీమధ్య మధ్యవర్తిగా మెలిగేవాడు. కనుక అతనికి గాఢమైన దైవానుభూతి వుండాలి. తన సోదరులైన తోడి ప్రజల కష్టసుఖాల్లో సులువుగా పాలుపంచుకొనే గుణం వుండాలి.

కల్వరిబలియైన పూజబలి నర్పించడం ద్వారా అతడు ప్రధానంగా మధ్యవర్తి ఔతాడు. కనుక ఏ గురువు విలువైన సరే అతడర్పించే పూజబలినిబట్టే కొలవాలి.

4. గురువు బాధ్యతలు

"నేను ప్రవితుజ్జయిన దేవుణ్ణి, నాలాగే విూరూ పవిత్రులుగా వుండండి" అన్నప్రభువు ఆజ్ఞ ప్రధానంగా గురువుకి వర్తిస్తుంది. అతడు దేవునికి సన్నిహితుడుగా జీవిస్తూపవిత్రంగా మెలగాలి. ఈ పవిత్రతను సాధించందే గురువు రాజు, ప్రవక్త కాపరి అనే తన మూడు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేడు. గురువు గురుపట్టం పొందేపుడు బిషప్పగారు అతని హస్తాలకు క్రిస్మాతైలంతో అభిషేకంచేస్తారు. అప్పటినుండి అతడు