పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమాజాన్ని నిర్మించే ప్రధాన సాధనం దివ్య సత్రసాదబలి. కనుక అతడు ఈ బలినియోగ్యంగా అర్పించి తన ఆధీనంలో వున్న స్థానిక క్రైస్తవ సమాజాన్ని పెంపులోనికి తీసికొని వస్తుండాలి.

3. వరప్రసాద ప్రాప్తి

గురుపట్టం ద్వారా గురువు పవిత్రాత్మను పొందుతాడు. ఈ యాత్మ సకల వరాలకీ సర్వపాబ్రిత్యానికీ మూలం. కనుక ఈ యాత్మద్వారా గురువుకి అపారమైన పావిత్ర్యం లభిస్తుంది, ప్రతి అభిషేకంలోను నరుడు ఆత్మను పొందుతాడు. కనుక యాజకత్వంలోని మూడంతస్తులకూ, అనగా బిషప్పకీ గురువుకీ డీకనుకీ, ఆత్మ సమృద్ధిగా లభిస్తుంది.

1) గురుపట్టంద్వారా గురువుకి ప్రత్యేకమైన వరప్రసాదం లభిస్తుంది. దీని వలన అతడు క్రీస్తుని పోలినవాడవుతాడు. అపర క్రీస్తుగా మారతాడు. క్రీస్తు నిరంతరం ప్రేమతో తన్ను తాను తండ్రికి అర్పించుకొంటూంటాడు. అతడు పూర్వవేదయాజకుల్లాగ ఏదో బలిపశువునర్పింపడు, తన్ను తానే తండ్రికి అర్పించుకొంటాడు. గురుపట్టం ద్వారా క్రీస్తుకి పోలికగా వుండే గురువులో కూడ ఈ ప్రేమా సమర్పణమూ కన్పించాలి. అతనిలో నిస్వార్ధమూ వినయవిధేయతలూ చూపట్టాలి. తన లాభం తాను చూచుకోక దేవునికీ ప్రజలకూ సేవలు చేయాలి. ఈ శక్తి అతని ప్రభువునుండే లభిస్తుంది.

పూజబలిలో అతనికి తన్ను తానర్పించుకొనే శక్తి దేవుణ్ణి ఆరాధించే శక్తి వస్తుంది. పాపోచ్చారణంలో పాపులపట్ల దయజూపే శక్తి వస్తుంది. అలాగే ఇతర దేవద్రవ్యానుమానాల్లో కూడ.

బోధచేసినపుడు క్రీస్తు ఆత్మ అతన్ని ప్రేరేపిస్తుంది. అతనిచే ప్రజలకు ఉపయోగపడే అంశాలు చెప్పిస్తుంది. అతడు మొదట తాను వాక్యాన్ని ధ్యానం చేసికొని అటుపిమ్మట తాను మననం చేసికొన్న వాక్యాన్ని ఇతరులకు వివరించేలా చేస్తుంది.

తాను మందను నడిపించేపుడు క్రీస్తు ప్రేమా వినయమూ అతనికి ఆదర్శంగా వుంటాయి. కావున అతడు మందపై అధికారం చెలాయింపక దానికి మాదిరిగా వుండగల్లుతాడు -1పేత్రు 5:3. దానికి సేవలు చేయగల్లుతాడు - లూకా 22,26, విశేషంగా, ఇతరులకు బోధించిన పిదప తాను భ్రష్టుడు కాకుండావుండేలా జాగ్రత్తపడ గల్లుతాడు - 1కొ 9:27. ప్రధానయాజకుని అనుంగుతల్లియైన మరియమాత తన కుమారుని సేవకులైన గురువులను విశేషాదరంతో కాపాడుతుంది.

2) కాని వరప్రసాదాలన్నీ గురువుమీూద యాంత్రికంగా పనిచేయవు. అతడు వాటితో సహకరించాలి. వాటిని జాగ్రత్తగా వినీయోగించుకోవాలి.