పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ట్రెంటు మహాసభ ఈలా బోధించింది. బిషప్పు అభిషేకం పొందినపుడు ఆత్మ అతని మీదికి దిగివస్తుంది. అతని హృదయం మీద చెరగని ముద్రపడుతుంది. పవిత్రాత్మే అతన్ని తిరుసభకు పాలకుణ్ణిగా నియమిస్తుంది. అతడు గురువు కంటె అధికుడు. భద్రమైన అభ్యంగమూ, గురుపట్టమూ, ఇచ్చేది అతడే. గురువునకు లేని కొన్ని ఇతరాధికారాలు కూడ అతనికుంటాయి.

రెండవ వాటికన్ సభ ఈలా బోధించింది. "బిషప్పు అభిషేకం ద్వారా పవిత్రాత్మనూ అక్షయమైన ముద్రనూ పొందుతాడు. అతడు ప్రముఖంగాను, కంటికి కన్పించేరీతిలోను క్రీస్తు స్థానాన్ని స్వీకరిస్తాడు. క్రీస్తులాగే తానూ బోధకుడూ, కాపరీ, యాజకుడూ ఔతాడు. క్రీస్తుస్థానంలో వుండే పనిచేస్తాడు. తోడి బిషప్పులను అభిషేకించేది అతడే. ఈ వాక్యాలనుబట్టి పీఠాధిపతి స్థానం ఎంత ఘనమైందో ఊహించుకోవచ్చు.

2) గురువు. తొలిరోజుల్లోని పెద్దలే రెండవ శతాబ్దంలో గురువులుగా గుర్తింపు పొందారని చెప్పాం. గురుత్వాన్ని మొదటినుండి దేవద్రవ్యానుమానంగా గుర్తిస్తూ వచ్చారు.

రెండవ వాటికన్ మహాసభ గురుత్వాన్ని గూర్చి ఈలా బోధించింది. గురువులు అభిషేకం ద్వారా ప్రధాన యాజకుడైన క్రీస్తుకి అనురూపంగా గురుపట్టం పొంది బోధకులూ, కాపరులూ, ఆరాధనను నిర్వహించేవాళ్ళూ ఔతారు. వాళ్ళ తమ బిషప్పుతో కలసి ఒకే యూజకత్వంలో పాలుపొందుతారు. ఈ యాజకత్వంలో మాత్రం వేరువేరు అంతస్తులుంటాయి. గురువులు తాము పనిచేసే తావులో తమ బిషప్పుని ప్రత్యక్షంచేసికొంటారు. అతని బాధ్యతలనూ పనులనూ తమవిగా చేసికొంటారు. ఒక బిషప్ప క్రింద పనిచేసే గురువులంతా ఒకే అభిషేకమూ, ఒకే పనీ కలిగి వుండడంవల్ల ఒక్క బృందంగా ఏర్పడతారు. వాళ్లు తమ బిషప్పుకి తోడిపనివాళ్ళు బిషప్పుతో పాటు తామూ క్రీస్తుచే పంపబడినవాళ్ళు.

3) పరిచారకుడు. తొలిరోజుల్లో పరిచారకులు అపోస్తలులకూ పర్యవేక్షకులకూ సహాయం చేస్తుండేవాళ్ళు. అపోస్తలులు వీళ్ళమీద చేతులు చాచి వీళ్ళకు పరిచారక పట్టాన్ని ఇచ్చారని చదువుతున్నాం. అచ. 6:1-6. పౌలు సమాజాల్లో స్త్రీపరిచారికలు గూడా వుండేవాళ్ళ - రోమా 16,1-2. ఈ పరిచారకులు తొలిరోజుల్లో చేసిన పనులు రెండు. వేదబోధ చేయడం, సేవాకార్యాలు నిర్వహించడం, అపోస్తలులనాడు క్రైస్తవులు యెరూషలేములో కొన్నాళ్ళపాటు ఉమ్మడిజీవితం జీవించారు. ఈ క్రైస్తవులకు పరిచారకలు అన్నమూ మొదలైన భౌతిక వస్తువులను అందజేసేవాళ్లు. పేదాబిక్కీని పరామర్శించేవాళ్లు. పేదలకు సేవచేయడం పరిచారకుల బాధ్యతల్లో ముఖ్యమైంది. ఈనాడు కూడ వాళ్లు తిరుసభ పేదవారి పట్ల చూపించే ఆదరణకు సాక్ష్యంగా వుంటున్నారు. తిరుసభ చరిత్రలో