పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తు శిష్యులకు తర్ఫీదునిచ్చి వాళ్ళను గురుత్వానికి సిద్ధం చేసాడు. వాళ్ళు తన యాజకత్వాన్ని కొనసాగించాలని కోరాడు. వాళ్ళకు తన ఆత్మను ప్రసాదించాడు. లోకాంతం వరకు నేను విూతో వుంటానని మాట యిచ్చాడు-మత్త 28,20. అనగా క్రీస్తు అపోస్తలులతోను వాళ్ళ అనుయాయులతోను వుంటాడు. తండ్రి తన్ను పంపినట్లే తానూ వాళ్ళను పంపాడు - యోహా 20,21. తన తర్వాత వచ్చే ఆత్మ వాళ్ళకు సమస్తవిషయాలు బోధిస్తుంది-14,26. ఈ వాక్యాలన్నిటినిబట్టి రెండు విషయాలు అర్థం చేసికోవాలి. మొదటిది, క్రీస్తు అపోస్తలులనూ వాళ్ళ అనుయాయులనూ గురువులనుగా నియమించాడు. రెండవది, గురుత్వపు బాధ్యతలను నిర్వహించే శక్తిని గూడ వాళ్ళకు దయచేసాడు. వాళ్ళు పవిత్రాత్మనూ ఉత్తాన క్రీస్తు సాన్నిధ్యాన్నీ వరప్రసాదాన్నీస్వీకరించండం ద్వారా ఈ శక్తిని పొందారనుకోవాలి.

క్రీస్తు గురుత్వమనే సంస్కారాన్ని స్థాపించాడేగాని, దాన్ని ఏలా నిర్వహించాలో చెప్పలేదు. కనుక ఈ సంస్కారాన్ని నిర్వహించే పద్ధతిని, యూదుల సంప్రదాయాన్ననుసరించి అపోస్తలులే నియమించి వుంటారు. అపోస్తలుల కాలంలో అభ్యర్థులకు గురుత్వాన్ని ఇచ్చేపుడు వాళ్ళమీద చేతులు చాచి ప్రార్ధన చేసేవాళ్ళు. ఈ రెండు సంజ్ఞలూ నూతవేదంలో స్పష్టంగా కన్పిస్తాయి. తిమోతి యాజకత్వాన్ని పొందినపుడు పౌలూ ఇతర పెద్దలూ అతనిమిూద చేతులు చాచారు-2తిమో 1,6. ఇంకా, ఆ సందర్భంలో ప్రవక్తలు ప్రవచనాలు కూడ పల్మారు-1తిమో 4,14. ఈ "ప్రవచనాలు" ప్రార్థనలైయుంటాయి. మరో తావులో, పౌలు బర్నబాలు ప్రతి సమాజంలోను పెద్దలను నియమించి వారిమిూద చేతులు చాచారనీ, ఉపవాసపూర్వకంగా ప్రార్థనలు చేసారనీ చెప్పబడింది-అ,చ.14,23. కనుక అభ్యర్థిమీద చేతులుచాచి ప్రార్ధనంచేయడం గురుపట్టాభిషేకంలో జరిగే మతకర్మలు. వీటిని అపోస్తలులే నియమించి వుంటారు.

2. ఈ యాజకత్వ సంస్కారంలో మూడు అంతస్తులున్నాయి.

గురుత్వం ఒకటే ఐనా దానిలో మూడు అంతస్తులున్నాయి. అవి బిషపు, గురువు, పరిచారకుడు అనే పదవులు. ఈ మూడు అంతస్తులను గూర్చి వివరంగా తెలిసికొందాం.

1) బిషప్పు, బిషప్పు గురుత్వం పరిపూర్ణమైంది. గురువు గురుత్వం బిషప్పు గురుత్వం కంటె తక్కువ స్థాయిలోనిది. పరిచారకుని గురుత్వం ఇంకా తక్కువ స్థాయిలోనిది.

బిషప్పుకి పరిపూర్ణమైన యాజకత్వం వుంటుందని చెప్పాం. మొదట "పర్యవేక్షకులు" అనబడేవాళ్ళే రెండవ శతాబ్దంలో బిషప్పలుగా మారిపోయారని పూర్వాధ్యాయంలో వివరించాం. పితృపాదులు బిషప్ప యాజకత్వంలో మొదటి అంతస్తును పొందుతాడని చెప్పారు. పీఠాధిపతి పదవి నిజమైన సంస్కారమని కూడ వాకొన్నారు.