పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరిచారకులు క్రమేణ ప్రాముఖ్యాన్ని కోల్పోయారు. నేడు ల్యాటిన్ అమెరికాలో మాత్రమే వీళ్ళ ఎక్కువగా పనిచేస్తున్నారు. మనదేశంలో డీకన్ల అసలులేరు. రెండవ వాటికన్ సభ ప్రపంచమంతటా డీకన్ల అంతస్తును మళ్ళా పునరుద్ధరించాలని కోరింది.

3. బిషప్ప యాజకత్వం, గురువు యాజకత్వం

పరిచారకుని అంతస్తు మనకంత ముఖ్యంకాదు. కనుక ఇక్కడ బిషప్ పు యాజకత్వానికి గురువు యాజకత్వానికీ గల వ్యత్యాసాన్ని విపులంగా పరిశీలిద్

1) యాజకత్వం ఒక్కటే. అది క్రీస్తు యాజకత్వం, నరమాత్రులంతా ఈ క్రీస్తు యాజకత్వంలో పాలుపొందే యాజకులౌతారు. కాని బిషప్పు ఈ యాజకత్వాన్ని పరిపూర్ణంగా పొందుతాడు. అతనిది మొదటి అంతస్తు, గురువు అపరిపూర్ణంగా పొందుతాడు. అతినిది రెండవ అంతస్తు.

అభిషేకం ద్వారా బిషప్ప, యాజకుడు ప్రవక్త కాపరి అనే మూడు లక్షణాలను సంపూర్ణంగా పొందుతాడు. ఈ అభిషేకం ద్వారా అతన్ని బిషప్పు బృందంలోనికి ప్రవేశపెడతారు. అలా ప్రవేశపెట్టడం వలన అతడు బిషప్పు ఔతాడు. కనుక అతని అధికారం బృందాధికారంగాని వ్యక్తిగతమైందికాదు. ఈ బృందభావాన్ని సూచించడానికే బిషప్పని అభిషేకించేపుడు ఒక్కరు కాక ముగ్గురు బిషప్పులు అభిషేకిస్తారు. పైగా తిరుసభ బోధనక్రియలో బిషప్పులంతా గలసి పొరపడనివరం పొందుతారు. ఐనా ఏ బిషప్పుకి గూడా వ్యక్తిగతంగా ఈ వరం వుండదు.

బిషప్ప ప్రముఖంగా క్రీస్తు యాజకత్వాన్ని ఈలోకంలో ప్రత్యక్షం చేసేవాడు అతడు గొప్ప ఆరాధన కార్యకర్త స్థానిక తిరుసభకు ప్రధానాధికారి. క్రీస్తు స్థానంలో వుండేవాడు. బిషప్పులంతా కలసి అపోస్తలుల బృందానికి వారసులు. కనుక స్థానిక తిరుసభలో బిషప్పు అపోస్తలులకు ప్రతినిధి. కావుననే సిప్రియన్ భక్తుడు చెప్పినట్లు, బిషప్పు తిరుసభలో నెలకొని వుంటాడు, తిరుసభ బిషప్పులో నెలకొని వుంటుంది. బిషప్పు స్థానిక తిరుసభకు అధిపతిగా వున్నా విశ్వతిరుసభకు ప్రతినిధిగా వుంటాడు. మేత్రాసనం స్థానిక తిరుసభే ఐనా విశ్వతిరుసభను సూచిస్తుంది.

అభిషేకంలో బిషప్పు ప్రముఖంగా ఆత్మను పొందుతాడు. అప్పటినుండి అతనికి బిషప్పు పదవికి తగిన వరప్రసాదం లభిస్తూంటుంది. ఈ యభిషేక వరప్రసాదంద్వారా అతడు శిరస్సు ఔతాడు. కాని ఈ యభిషేక వరప్రసాదం గురువుని బిషప్పుకి సహాయుద్దీగా మాత్రమే చేస్తుంది.

2) ఇక గురువు బిషప్పుల బృందం యాజకత్వంలో పాలుపొంది గురుమోతాడు. గురువు తన్నభిషేకించే ఒక్క బిషప్పు యాజకత్వంలో గాక బిషప్పుల బృందం అంతటి