పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దుర్గుణాలవల్ల మనం క్రైస్తవ మతానికే అపఖ్యాతి తెస్తాం. ఇరుగుపొరుగు హిందువులు మన రోజువారి జీవితంలో క్రీస్తుని చూడలేక పోతుంటారు. మనలో పవిత్రాత్మకు బదులుగా దుష్టాత్మను చూస్తుంటారు. కనుక మన కుటుంబజీవితం ఎంత శుద్ధంగా ఉందా అని పరిశీలించి చూచుకొంటూండాలి. 2. తల్లి, తండ్రి

కుటుంబానికి తండ్రి శిరస్సు, అధిపతి. నాయకత్వం వహించేవాడు అతడే. కాని కుటుంబానికి తల్లి హృదయంలాంటిది. గుండె ప్రేమకు చిహ్నం. ఇంటిని ప్రేమతో నింపేది తల్లే ఇంటికి తండ్రి యజమానుడు, పరిపాలకుడూ ఐతే తల్లి అనురాగంతో ఇంటిల్లిపాదినీ ఐక్యంజేసేది. "ఇంటిని జూడు ఇల్లాలిని జూడు" అన్నట్లుగా గృహశోభ చాలవరకు తల్లిపై ఆధారపడి ఉంటుంది. 3. నిబంధనం

వేదశాస్తులు వివాహ జీవితాన్ని నిబంధనంతో పోల్చారు. దేవుడు పూర్వవేదంలో యిస్రాయేలీయులతోను నూత్నవేదంలో క్రైస్తవులతోనూ నిబంధనం చేసికొన్నాడు. నిబంధనకర్తలైన దేవుడూ నరజాతీ ఒకరిపట్ల ఒకరు విశ్వసనీయులుగా మెలగాలి. ఇక, వివాహజీవితంలో భార్యాభర్తలే ఒకరితో ఒకరు నిబంధనం చేసికొంటారు. కనుక వాళ్ళిద్దరూ ఒకరిపట్ల ఒకరు విశ్వసనీయులుగా మెలగాలి. ఒకరికొకరు ఉపకారమేగాని అపకారం తలపెట్టగూడదు. ఒకరిపట్ల ఒకరు గాధానురాగంతో మెలగాలి.

వివాహ విషయాలు-వేద పటనాలు

1. పూర్వవేదం

1. నరునిలోను దేవుని పోలిక, ఆది 126-28

  సంతానాన్ని కనడం 

2. ఏవ ఆదామునకు సహాయకురాలు, ෂධි 2, 18-25

  వాళ్ళిద్దరూ ఒకే వ్యక్తిగా ఐక్యంగావాలి 

3. ఒడంబడిక వివాహం లాంటిది యొష 54, 5, 62,1-5 4. తోబియా ప్రార్ధన తోబీ 85-8 5.కుటుంబజీవితం కీర్త 45,10-11 6. ఆదర్శ గృహిణి సామె 31,10-31