పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భర్త చూపవలసిన ప్రేమ రంకులాడి క్రీస్తు-శ్రీసభ వివాహితులు 2. నూత్నవేదం కన్యాజీవితం, గురుజీవితం 4. విధవ జీవితం 5. ఉత్తానజీవితంలో వివాహం ఉండదు 6. క్రైస్తవస్త్రీకి ఉండవలసిన వినయం 7. విడాకులు పనికిరావు . వ్యభిచార దోషం 9. మానసిక వ్యభిచారం ఆత్మ శోధనం ਹੇਕo 5, 15-20 ਹੇo 7,6-27 Ꭷ8b 5, 21-88 1S 7,1-16 1S 7,32-34 మత్త 19,12 1Ց" 7,39-40 మార్కు 12,25 1పేత్రు 3,1-6 1తిమో 2,9-15 మత్త 19,3-9 1S 6, 12-20 మత్త 5,28 ఇంతవరకు వివాహజీవితాన్ని గూర్చి ఆయా విషయాలు విచారించి చూచాం. ఇక యీ విషయాలు మన జీవితానికి ఏలా వర్తిస్తున్నాయో చిత్తశుద్ధితో పరీక్షించి చూచుకోవాలి. ఇదే ఆత్మశోధనం. ఓ వ్యక్తి తాను భార్యగావచ్చు, భర్తగావచ్చు. ఎవరైనాగాని నేను, నాయిల్లు, నా భర్త లేక భార్య నా పిల్లలు అనే నాలుగంశాల క్రింద ఈ యాత్మశోధనను కొనసాగించవచ్చు. 1. భర్తగా నా బాధ్యతలు 1. నేను 1. నా యాకారం ఏలా వుంటుంది? నేను శుభ్రంగా వుంటున్నానా? ధరించే దుస్తులు, తల జట్టు మొదలైనవి నీటుగా వుంటున్నాయా? 2. నా పనివస్తువులను చిందరవందరగా పారవేస్తున్నానా లేక మట్టసరిగా ఓ ప్రక్కన అమర్చివుంచుకుంటున్నానా? 64