పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిల్లలు తమ తరపున తాము తల్లిదండ్రులను గౌరవించి ప్రేమించాలి. "నాయనా! నీకు ప్రాణమిచ్చినవారు నీ జననీజనకులు. వారి ఋణాన్ని నేవేలా తీర్చుకొంటావు? అనే సీరా జ్ఞానగ్రంథ వాక్యాన్ని సర్వదా స్మరించుకొంటుండాలి-7,28. తల్లిదండ్రులకు విధేయులు కావాలి. ముసలిప్రాయంలో వారిని ప్రేమతో ఆదుకోవాలి.

కుటుంబాన్ని ఐక్యపరచేదీ, భక్తిని పెంచేదీ, గొడవలు సమసిపోయేలా చేసేదీ ప్రార్ధనం. కనుక రోజు కొన్ని నిమిషాలపాటు కుటుంబ సభ్యులంతా కలసి ప్రార్ధనం చేసికోవాలి. రోజూ కాసేప ప్రార్ధన చేసికొనే యింటిని పవిత్రాత్మశక్తి ఆవరించి వుంటుంది. చిన్ననాడు కుటుంబంలో ప్రార్థన నేర్చుకోని పిల్లలు పెరిగి పెద్దయ్యాక ప్రార్థన చేయడం అరుదు.

4. హిందూసమాజం మధ్యలో వసిస్తున్నాం

ఈ దేశంలో క్రైస్తవులమైన మనం అల్పసంఖ్యాకులం. అధిక సంఖ్యాకులైన హిందువులమధ్య చీకట్లో మినుకుమినుకుమనే దీపాల్లాగ కన్పిస్తూంటాం. మన కుటుంబ జీవితం మన చుట్టుపట్లవుండే హిందువులకు ఆదర్శవంతంగా కన్పించాలి. క్రీస్తు ప్రేమకూ సేవకూ మంచితనానికీ సాక్ష్యంగా వుండాలి. అవకాశం వచ్చినపుడు మనం క్రీస్తుని గూర్చి తోడి హిందువులకు తెలియజేయగలిగి ఉండాలి. మన యింటిలో దైవార్చన క్యాలెండరు, మతపరమైన పటాలు, స్వరూపాలు మొదలైనవి తప్పక ఉండాలి. ఇవి క్రైస్తవ వాలకాన్ని భక్తినీ సూచిస్తాయి.

అంతా కుటుంబ జీవితం మీదనే ఆధారపడి ఉంటుంది. భక్తిగల కుటుంబాలకు ఏ కొరతా రాదు. కానాపూరి కుటుంబంలో లాగ క్రీస్తు వారి కుటుంబంలో నెలకొని వుంటాడు. వారి పిల్లల్లో కొందరు గురువులుగా మఠకన్యలుగా తయారౌతారు. ఇక భక్తిలేని కుటుంబాలకు కలిగే అనర్ధం అంతా యింతా కాదు. తాజెడిన కోతి వనమెల్ల చెరిచింది అన్నట్లుగా వాళ్ళ ఇతర క్రైస్తవులనుగూడ చెడగొడతారు. క్రైస్తవ మతానికే తలవంపులు తెస్తారు. ఫలితంగా దేవుని దీవెనకుమారుగా శాపాన్ని కొనితెచ్చుకొంటారు.

ప్రార్థనా భావాలు

1. మంచి ఆదర్శం

మన క్రైస్తవులు తరచుగా బడుగువర్గాలకు చెందినవాళ్లు, పేదజనం, కూలినాలి చేసికొని బ్రతికేవాళ్ళు అనేక కారణాలవల్ల మన కుటుంబాల్లో త్రాగుడు, దొంగతనం, మోసం, అబద్దాలు, సోమరితనం మొదలైన దురభ్యాసాలు కన్పిస్తుంటాయి. ఈ