పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ యద్వైతవాదం బోధించే దివ్యత్వం మన క్రైస్తవమతం బోధించే దివ్యత్వం కంటె భిన్నమైంది. మన తలపున నరులకు స్వభావ సిద్ధమైన దైవత్వం లేదు. దైవత్వం మనకు వర ప్రసాదం వలన లభిస్తుంది. దైవత్వాన్ని పొందినంకకూడ నరులు దేవునితో కలసిపోరు. మోక్షంలోకూడ నరుడు వేరు, భగవంతుడు వేరు. కాని అద్వెతవాదం ప్రకారం నరులు స్వభావ సిద్ధంగానే భగవంతులు. ఈ భగవత్వభావాన్ని వాళ్ళు ఏనాడూ పోగొట్టుకోలేదు. మరచిపోయారు అంతే. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసికోగానే నరుడూ భగవంతుడై పోతాడు.

ఈ యద్వెతవాదాన్ని హైందవ లెప్పడూ సకారణంగా రుజవు చేయరు. ప్రాచీన ఋషుల అనుభవమని మాత్రం చెపుతూంటారు. వ్యక్తిగతానుభవానికి దైవశాస్త్రరీత్యా ఏమి విలువ? మన దివ్యగ్రంథాలూ పారంపర్యబోధా నరుడు భగవంతుడేనని చెప్పవు.సృష్టి ప్రాణియైన నరుడు సృష్టికర్తనుండి దివ్యత్వమనే భిక్షను స్వీకరిస్తాడని మాత్రం చెప్తాయి.

ప్రార్థనా భావాలు



1. వరప్రసాదం అంటుమామిడి లాంటిది. పుల్లమామిడిపై తీయమామిడిని అంటుకడతాం. దీనివలన తీయమామిడి పుల్లమామిడి సారాన్ని తలలోనికి మార్చుకొని తీయని పండ్లనిస్తుంది. పవిత్రీకరణ వరప్రసాదం మనమీద కట్టబడిన అంటులాంటిది. మనంతటమనం పుల్లమామిడి లాంటివాళ్ళం. ప్రాకృతిక మానవులం. మన జీవితంకూడ పుల్లనిపండ్లనేగాని తీయనిపండ్లనీయలేదు. కాని పవిత్రీకరణ వరప్రసాదం ఓ మారు మనమీద అంటుపాతుకొందో, ఇక మన జీవితమూ మన కార్యాలూ దివ్యత్వాన్ని పొందుతాయి. మన తలపుల్లో పలుకుల్లో చేతల్లో దివ్యత్వం గోచరిస్తుంది. కనుకనే పౌలు "నేను జీవిస్తున్నాను. కాదు, నాయందు క్రీస్తే జీవిస్తున్నాడు" అని చెప్పకొన్నాడు - గల 2, 20. ఇది చాల లోతైన వాక్యం.

2. వరప్రసాదం ద్వారా ప్రాకృతిక మానవులమైన మనం దివ్యమానవుల మౌతాం. దేవుని బిడ్డల్లా ప్రవర్తిస్తాం. ఓమారు ఫ్రాన్సుదేశపు లూయిూరాజు కొమార్తను ఆమె పరిచారిక చిన్నచూపు చూచిందట. రాజకుమారి ఆగ్రహించింది ప్రభువపత్రికనైన నన్ను చిన్నచూపు చూస్తావా అని గద్దించింది. కాని ఆ పరిచారిక ఏమీ జంకక పరలోక భూలోకాలకు ప్రభువైన దేవుని పత్రికను నన్ను ఈ రీతిగా ప్రశ్నిస్తావా అంది, ఔను, మనం వరప్రసాదంద్వారా దేవుని బిడ్డలం, దివ్యజీవితం జీవించేవాళ్ళం. తరచుగా ఈ సత్యాన్ని జఞపకం చేసికోవడం మంచిది

.